సీన్ ఉల్టా…! ఆటో డ్రైవర్ పై మహిళ అత్యాచార యత్నం!

సాధారణంగా మహిళలకు లైంగిక వేధింపులు మగరాయుళ్ల నుంచి ఎదురవుతుంటాయి. కానీ, దేశ రాజధాని ఢిల్లీలోఈ  సీన్ ఉల్టా అయ్యింది. ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ.. తనను తృప్తిపరచాలంటూ ఆటో డ్రైవర్‌ను బలవంత పెట్టి, వేధింపులకు పాల్పడి జైలుపాలైంది.  దక్షిణ ఢిల్లీలోని సాకేత్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ… బుధవారం మధ్యాహ్నం సాకేత్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్జున్ నగర్‌లోని తన ఫ్లాట్‌కు వెళ్లేందుకు ఒక ఆటోలో ఎక్కింది. ఈ ఆటోను 41 యేళ్ళ ఉమేష్ ప్రసాద్ అనే డ్రైవర్ నడుపుతున్నాడు. అర్జున్ నగర్ చేరుకున్న తర్వాత ఆటో డ్రైవర్‌ను ఇంట్లోకి ఆహ్వానించింది. ఆ సమయంలో ఇంట్లో రేణూ రూమ్మెట్ కూడా ఉంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్‌కు తాగేందుకు మంచినీరు ఇచ్చి.. ఉన్నట్టుండి తలుపులు లాక్ చేసింది.

శారీరకంగా సంతృప్తిపరచమని ప్రాధేయపడింది. దీనికి ఆటో డ్రైవర్ సమ్మతించలేదు. పిమ్మట వైన్‌ ఆశ చూపింది. దీనికి కూడా ఉమేష్ లొంగలేదు. దీంతో పిచ్చెక్కినట్టు ప్రవర్తించిన ఆ మహిళ.. అతడిని బలవంతంచేసి, బట్టలను చింపేసి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. ఈ తతంగాన్నంతా ఇంట్లో ఉండే తన రూమ్మెట్ వీడియో తీసింది. ఆ తర్వాత వీరిద్దరూ ఏదో చర్చించుకునేందుకు మరో గదిలోకి వెళ్లగా.. ఇదే అదనుగా భావించిన ఆటో డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో  కాలు కూడా విరిగిందని బాధితుడు చెప్పారు.

she attemped rape on him

దీనిపై ఆటో డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి సదరు మహిళను అరెస్టు చేసినట్టు చెప్పారు పోలీసులు. ఆమె వద్ద నుంచి నాలుగు బ్యాడ్జీలు, నాలుగు డ్రైవింగ్ లైసెన్సులను స్వాధీనం చేసుకున్నామని, గతంలో కూడా ఇదేవిధంగా నలుగురు డ్రైవర్లను బలంవంతం చేసినట్టు తెలుస్తోందని, దీనిపై ఆరా తీస్తున్నట్టు చెప్పారు కాబ్స్ . కాగా, రేణు రూమ్మెట్‌గా ఉన్న మరో మహిళను టాంజానియా దేశస్థురాలిగా గుర్తించారు. ఈమె సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నట్టు విచారణలో తేలిందని పోలీసులు అన్నారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top