జీన్స్ ప్యాంట్‌పై 10 సార్లు షేవింగ్ చేసి చూడండి.!

రంగు వెలసిపోయి, మాసినట్టుగా ఉండి, చిరిగిపోయి, షేడ్ అయినట్టుగా ఉండేవి… అవేనండీ జీన్స్! జీన్ ప్యాంట్స్! వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో కాలంగా ఈ తరహా వస్ర్తాలు జనాలను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ప్రధానంగా యువత జీన్స్ వస్ర్తాల పట్ల అత్యంత మక్కువను ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయితే ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.

షేవింగ్ చేసుకునే మగవారి కోసం మరింత సులభంగా ఆ పని చేసుకునేందుకు రేజర్ బ్లేడ్లు ఉపయోగపడతాయని తెలుసు కదా! ఆ, అవును. అయితే ఆ రేజర్ బ్లేడ్లు కేవలం కొన్ని సార్లకు మాత్రమే షేవింగ్ చేసుకోవడానికి పనికొస్తాయి. అనంతరం వాటిని మార్చి కొత్త రేజర్ బ్లేడ్లను వాడుకోవాల్సి ఉంటుంది. ఆగండి, జీన్స్ ప్యాంట్లని స్టార్ట్ చేసి మళ్లీ రేజర్ బ్లేడ్ల గురించి చెబుతున్నారేంటని ఆశ్చర్యపోతున్నారా? అదేమీ లేదండి బాబూ! మీరు ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు, విసుగు చెందాల్సిన పని అంతకన్నా లేదు. ఎందుకంటే జీన్స్ ప్యాంట్లకు, రేజర్ బ్లేడ్లకు ఓ సంబంధం ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

shaving on jeans 1

జీన్స్ ప్యాంట్లను సాధారణంగా డెనిమ్ అనబడే ఓ రకమైన వస్త్రంతో తయారు చేస్తారు. ఈ వస్త్రం అత్యంత దృఢంగా ఉండడమే కాకుండా అంత త్వరగా చిరిగిపోదు కూడా. అయితే ఈ డెనిమ్ వస్ర్తాల తయారీ కోసం వాడే దారాలు సహజంగా సిల్క్ లేదా మెటల్‌తో తయారు చేసినవే అయి ఉంటాయి. దీని వల్ల ఏదైనా లోహ పదార్థం ఈ దారాలకు తగిలితే అది మరింత పదునుగా తయారవుతుంది. సరిగ్గా ఇదే సూత్రం ఆధారంగా రేజర్ బ్లేడ్ కూడా పనిచేస్తుంది.

shaving on jeans

అనేక సార్లు వాడి ఉండి, ఇక పడేయాల్సిందే అనుకున్న తుప్పు పట్టిన షేవింగ్ రేజర్ బ్లేడ్‌ను జీన్స్ ప్యాంట్‌పై 10 సార్లు ఒకే డైరెక్షన్‌లో షేవింగ్ చేస్తున్నట్టు గీయాలి. దీంతో బ్లేడ్‌పై ఉన్న తుప్పు, మరకలు పోయి అది పదునుగా తయారవుతుంది. ఇంకేముంది! ఆ రేజర్ బ్లేడ్‌ను మళ్లీ షేవింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ట్రిక్ చాలా బాగుంది కదూ! అయితే కొత్త జీన్స్‌పై ఇలాంటివి ట్రై చేయకపోవడమే బెటర్. పాతబడిపోయిన జీన్స్‌పై ఈ ప్రయోగాన్ని చేసి చూడండి. రిజల్ట్స్ చూసి మీరే షాక్ అవుతారు.

shaving on jeans

Comments

comments

Share this post

scroll to top