హిట్లతో దూసుకెళ్తున్న “శర్వానంద్” కు మారుతి “మహానుభావుడు” తో బ్రేక్ పడిందా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్(తెలుగులో)

Krishna

Movie Title (చిత్రం): మహానుభావుడు (Mahanubhavudu)

Cast & Crew:

 • నటీనటులు: శర్వానంద్, మెహ్రీన్ కౌర్, వెన్నెల కిషోర్, నాజర్, రఘుబాబు తదితరులు
 • సంగీతం: థమన్.ఎస్.ఎస్
 • నిర్మాత: వంశీ ప్రమోద్ (యూవీ క్రియేషన్స్)
 • దర్శకత్వం: మారుతి

Story:

సిడి వ్యాధితో బాధపడే హీరో శర్వానంద్ పరమ నీటుగాడు. చివరికి పెన్‌కి క్యాప్ లేకపోయినా.. వెతికిమరీ దానికి పెట్టేస్తాడు. తనది కాకపోయినా సరే.. నీట్‌గా ఏది కనిపించపోతే దాన్ని సర్దేస్తాడు. అంతెందుకు.. తల్లికి జర్వమొచ్చినా పట్టించుకోకుండా ఆమెకి అమడదూరంలో వుంటాడు. ఇతని పరమశుభ్రతని చూసి చాలామంది రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే.. అతనిలో వున్న ఆ డిజార్డర్‌ని చూసే హీరోయిన్ మెహ్రీన్ ప్రేమలో పడుతుంది. తన ఫ్యామిలీకి ఎలాగోలా ఒప్పిస్తుంది. కట్ చేస్తే.. ఏ వ్యాధిని చూసి మెహ్రీన్ అతడ్ని ప్రేమిస్తుందో, అదే ఆమె మనోభావాల్ని దెబ్బతీస్తుంది. దాంతో.. ఆమె అతనికి దూరం అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? శర్వానంద్ తిరిగి తన ప్రేమను పొందేందుకు ఏం చేశాడు?

Review:

“భలే భలే మగాడివోయ్” తర్వాత మారుతీ డైరెక్షన్ లో వచ్చిన సినిమా “మహానుభావుడు”. శతమానం భవతి, ఎక్ష్ప్రెస్స్ రాజా, రన్ రాజా రన్..ఇలా వరస హిట్లతో దూసుకెళ్తున్న శర్వానంద్ ఖాతాలో మరో హిట్ పడింది. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ శర్వానంద్ క్యారెక్టర్. సాంగ్స్ చిత్రీకరణ చాలా బాగుంది. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ తో కుర్రాళ్ల హృదయాలను దోచుకున్న “మెహ్రీన్” మరోసారి తన పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకుంది. స్టోరీ తెలిసిందే అయినా..మారుతీ తెరకు ఎక్కించిన విధానం బాగుంది.!

Plus Points:

 • కామెడీ
 • లవ్ ట్రాక్
 • సాంగ్స్
 • హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
 • శర్వానంద్ పెర్ఫార్మన్స్
 • ఇంటర్వెల్ ట్విస్ట్

Minus Points:

 • నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో ఊహించచ్చు
 • సాగదీసిన క్లైమాక్స్

Final Verdict:

కామెడీ, లవ్ ట్రాక్ తో ఎంటర్టైన్ చేసే పక్కా పైసా వసూలు చేసే సినిమా “మహానుభావుడు”

AP2TG Rating: 3.25 / 5

Trailer:

Comments

comments