యువ హీరో లు బహిరంగంగానే తమ సినిమాలు పరాజయం పాలైతే ధైర్యంగా తెలుపుతున్నారు..!!

క్రిస్మస్ కానుకగా విడుదల అయిన పడి పడి లేచే మనసు, అంతరిక్షం చిత్రాలు ఆశించినంత స్థాయిలో ఆడలేదు, ఈ రెండు సినిమాల పైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండటం తో ఆ అంచనాలను అందుకోలేకపోయాయి ఈ సినిమాలు. ఈ సినిమాలకు సంబంధించి పెట్టిన ప్రెస్ మీట్స్ లో వారి సినిమా రిజల్ట్స్ గురుంచి ధైర్యంగానే ఒప్పుకున్నారు వరుణ్ తేజ్, శర్వానంద్.

అంతరిక్షం సినిమా విడుదల అయ్యాక ప్రెస్ మీట్ లో అంతరిక్షం మూవీ హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ : ” ఈ సినిమా మీద కొంచెం క్రిటిసిసమ్ వచ్చింది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం, మా టీం కానీ, నేను కానీ ఇంకో సినిమా తీసేటప్పుడు మరింత జాగ్రత్త గా ఉంటాం, వ్యక్తిగతం గా చేసినా, కలిసి మరో సారి చేసినా, మేము మరింత జాగ్రత్తగా చేస్తాం. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు, ఇలాంటి సినిమాలను అంత త్వరగా ఆదరించారు. కానీ మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు చాలా థాంక్స్”, అని హీరో వరుణ్ తేజ్ తెలిపారు.

పడి పడి లేచే మనసు సినిమా విడుదల అయ్యాక ప్రెస్ మీట్ లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ : ” ఈ సినిమా గురించి చాలా ఊహించుకున్నాను. సినిమా పెద్ద రేంజ్ కి వెళ్తుందని అనుకున్నాను. కథ విన్నప్పుడు, సినిమా చేసేప్పుడు, ఇప్పుడు కూడా ఒకటైతే బలంగా నమ్ముతున్నాను. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడతున్న. అయితే విమర్శకులతో పాటు చాలా మందిని ఈ సినిమా మెప్పించలేకపోయింది. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. నెక్స్ట్ టైమ్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తా, మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు”, అని తెలిపారు శర్వానంద్.

నోటా చిత్రం ప్లాప్ అయ్యాక హీరో విజయ్ దేవరకొండ కూడా బహిరంగంగానే చిత్రం పరాజయం పాలవడం తో బాధ పడుతున్నా, తరువాత వచ్చే చిత్రం తో తప్పకుండా మిమ్మల్ని మెప్పిస్తా అని చెప్పారు. అప్పట్లో విజయ్ దేవరకొండ చేసిన ఈ ట్వీట్ సంచలనమే రేపింది, దానికి కారణం నిఖిల్ ఇండైరెక్ట్ గా విజయ్ ట్వీట్ ని ఉద్దేశించి ఇంకో ట్వీట్ వేసినందుకే, ఆ తరువాత ఆ ట్వీట్ ని నిఖిల్ డెలీట్ చేసారనుకోండి.

 

Comments

comments

Share this post

scroll to top