సెన్సార్ బోర్డ్ ను షేక్ చేస్తున్న‌ ఓ తెలుగు సినిమా.!! #We Support అంటూ మారుమోగుతున్న ఫేస్ బుక్ టైమ్ లైన్స్.

ఒక సినిమా విడుద‌ల కోసం సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద యుద్ద‌మే జ‌రుగుతుంది. ప్ర‌తి ఒక్క‌రి టైమ్ లైన్ శ‌ర‌ణం గ‌చ్ఛామీ అంటూ మారిపోయింది. హ్యాష్ ట్యాగ్ వి స‌పోర్ట్ అంటూ ఫేస్ బుక్ అంతా మారుమోగిపోతోంది. మంచిని చెప్పాల‌నుకుంటున్న ఓ సినిమా గొంతు నొక్కే కుట్ర జ‌రుగుతుందని సెన్సార్ బోర్డ్ డౌన్ డౌన్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. ప్రేమ్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ శ‌ర‌ణం గ‌చ్ఛామీ అనే సినిమాకు సెన్సార్ బోర్డ్ అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ఆ విష‌యం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మా సినిమాలో జ‌బ‌ర్థ‌స్త్ కామెడీ షో లాంటి డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు, చంపరా.. చంపేయ‌రా… అనే రామ్ గోపాల్ వ‌ర్మ చూపించే ర‌క్త‌పాత‌మూ లేదు, ఇప్ప‌టికింకా నా వ‌య‌స్సు నిండా ప‌ద‌హారే అంటూ అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేసే ఐట‌మ్ సాంగ్సూ లేవు, సుమోలు గాల్లోకి లేపే హీరో ఇజాయిలు, అమ్మాయి వెంట ప‌డి వేధించే పొకిరీ వేషాలు…టీచ‌ర్ల మీద జోకులు వేసే చిల్ల‌ర చేష్ట‌లు…ఇవేవీ లేవు…అయినా మా సినిమా విడుద‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డానికి సెన్సార్ బోర్డ్ కు ఏం అడ్డొచ్చిందో అర్థం కాట్లేదు….ఇది శ‌ర‌ణం గ‌ఛ్చామీ సినిమా బృందం ఆవేద‌న‌.!!

యువ‌కుల‌ను మేల్కొలిపేలా, మేధావుల‌ను సైతం ఆలోచించేలా రూపొందించిన ఈ సినిమా విడుద‌ల‌కు సెన్సార్ బోర్డ్ అడ్డు ప‌డుతుంద‌ని….వివిధ ప్ర‌జాసంఘాల నేత‌లు, విద్యార్థి నాయ‌కులు ఈ సినిమాకు స‌పోర్ట్ గా నిల‌బ‌డ్డారు.అంబేడ్క‌రిజాన్ని అద్భుతంగా చూపించిన ఈ సినిమా విడుద‌ల‌కు అనుమ‌తి నిరాక‌రించ‌డం వెనుకున్న ఆంత‌ర్యం ఏంట‌ని…వాళ్ళంతా సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ సీన్ల‌లో ఎక్క‌డ అశ్లీల‌త కానీ, ర‌క్త పాతం కానీ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

సినిమాలోని కంటెంట్ ను బ‌ట్టి సెన్సార్ బోర్డ్ స‌ద‌రు సినిమాకు U, U/A, A, S ల‌లో ఏదో ఒక స‌ర్టిఫికేట్ ఇస్తుంది. కొన్ని కార‌ణాల రీత్యా అంటే….స‌ద‌రు సినిమా విద్వేషాల‌ను రెచ్చగొడుతూ , శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల్గిస్తుంద‌ని, దేశ ర‌క్ష‌ణను దెబ్బ తీస్తుంద‌ని అనిపిస్తేనే ఆ సినిమాకు అనుమ‌తిని నిరాక‌రిస్తారు. కానీ శ‌ర‌ణం గ‌ఛ్చామీ సినిమా విష‌యానికి వ‌స్తే…ఇది పూర్తిగా సోష‌ల్ పొలిటిక‌ల్ జాన‌ర్ లో తీసిన సినిమా…..మ‌రి ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ అనుమ‌తి ఇవ్వ‌క‌పోడానికి అస‌లు కార‌ణం ఏంటని ప్ర‌శ్నిస్తున్నారు ఈ చిత్ర యూనిట్ .
సోష‌ల్ మీడియా ఒత్తిడితోనైనా సెన్సార్ బోర్డ్ దిగి వ‌స్తుందో ? లేదో చూడాలి.!

శ‌ర‌ణం గ‌చ్ఛామీ సినిమాలోని కొన్ని డైలాగ్స్:


Comments

comments

Share this post

scroll to top