[WATCH VIDEO] 2 రోజుల్లో 7 లక్షలకు పైగా వ్యూస్ తో షణ్ముఖ్ జస్వంత్ “సాఫ్ట్‌వేర్ లో ఇంతే” షార్ట్ ఫిల్మ్ వైరల్!

Azhar

ఇంస్టాగ్రామ్ మరియు యూట్యూబ్ లో స్టార్ గా మారిన షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాడు అనే విషయం చెప్పుకోవాల్సిన అవసరం లేదు! ఈ కుర్రోడు తన డాన్స్, డబ్ స్మాష్ వీడియోలతో కష్టపడి జనాలలో తనకంటూ ఓ స్థానం తెచ్చుకుంటున్నాడు.. తన ఫ్రెండ్ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన దీప్తి సునైనా తో చేసిన వీడియోస్ ఎంత వైరల్ అయ్యాయో అందరికి తెలిసిన విషయమే!

shanmukh jaswanth software lo inthe

అయితే ఈ మధ్య సుధీర్ బాబు హీరో మరియు ప్రొడ్యూసర్ గా రిలీజ్ కి సిద్ధం అయిన కొత్త సినిమా “నన్ను దోచుకుందువటే” లో పాత్ర కూడా చేసి ట్రైలర్ లో తన డైలాగ్ తో ఎంతో మంది ప్రశంసలు పొందాడు.. దాని మీద సోషల్ మీడియా లో కూడా చాలా పేజీ అడ్మిన్లు అభినందిస్తూ పోస్ట్స్ కూడా పెట్టారు.. అటు డాన్స్ తో, ఇటు ఫన్నీ వీడియోస్ తో జనాలకి దగ్గరయ్యే ప్రయత్నంలో ఏ మాత్రం వెనక్కి చూడకుండా ముందుకు సాగుతూ అందరి దగ్గర మర్క్స్ కొట్టేస్తున్నాడు షన్ను.. నెగటివిటీ ఎంత ఉన్న, విమర్శించే వారు ఎన్ని అంటున్న ఎక్కడ జంకకుండా పరిగెడుతున్నాడు..

అదే ఊపులో “సాఫ్ట్‌వేర్ లో ఇంతే!” అనే షార్ట్ ఫిలిం కూడా చేయడం జరిగింది.. రిలీజ్ అయిన రెండో రోజుకే 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి అంటే ఆ వీడియో ఎంత వైరల్ అయ్యిందో మీకు ఈ పాటికే అర్థం అయిపోయి ఉంటుంది.. బడా కంపెనీలల్లో ఎం జరుగుతుందో, ఇంటర్వ్యూలు ఎలా చేస్తారో పేరడీ రూపంలో చాలా హిలేరియస్ గా వీడియో సాగుతూ కనిపిస్తుంది..

shannu new video

అప్పట్లో శబరీష్ చేసిన VIVA అనే షార్ట్ ఫిలింతో షన్నుకి చాలా క్రేజ్ వచ్చింది.. మళ్ళీ అదే రీతిలో కాంటెంపరరీ జోక్స్ తో రియాలిటీ కి దగ్గరగా చూపిస్తూ అందరిని నవ్వించేలా స్క్రిప్ట్ తో ముందుకొచ్చాడు డైరెక్టర్ సుబ్బు. మధ్యలో AZAR వీడియో కాలింగ్ అప్ ప్రమోషన్ కూడా చేస్తూ స్క్రిప్ట్ కి తగ్గట్టే కామెడీ పండించాడు.. బిగ్ బాస్ కౌశల్ ఆర్మీ పేరు మీద వీడియోస్ చేస్తూ బాగా పాపులర్ అయిన డాన్సర్ మహబూబ్ కూడా ఈ వీడియోతో షన్నుతో కనిపిస్తాడు..

Cast and Crew:

Written & Directed by : Subbu K
DOP : Vinay Shanmukh & Vamsi Srinivas
Editing: Sai Baba
Cast : Shanmukh jaswanth, Mehaboob Dilse, Mukka Prudhvi, Mahishmathi, Satvik Roy

సాఫ్ట్‌వేర్ లో ఇంతే” వీడియో:

 

Comments

comments