షాంపూల కారణంగా మహిళలకు రొమ్ము క్యాన్సర్ తో పాటు, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన రోగాల బారీన పడే అవకాశం ఉందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలలో వెల్లడయింది. ఎక్కువగా ఉపయోగించే షాంపూలు, కాస్మొటిక్ పదార్దాలు, బాడీ లోషన్ల తయారీలో ఉపయోగించే రసాయనాల ద్వారా మహిళల్లో ‘రొమ్ము క్యాన్సర్’ వచ్చే అవకాశం పెరుగుతుందని ఈ పరిశోధనలో తేలింది..
ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త డేల్ లీట్మెన్ వెల్లడిస్తూ.. ‘తక్కువ పరిమాణంలో వాడుతున్నప్పటికీ నిలువ కొరకు వాడే రసాయనాలు క్యాన్సర్ వ్యాధికి కారకాలవుతున్నాయి. శరీరంలో ఈస్ట్రోజన్‌ను పోలినటువంటి రసాయనాలయిన పారాబీన్స్ను షాంపూలు, కాస్మొటిక్స్‌లలో స్వల్ప మోతాదులో వాడుతున్నారు. వీటి వాడకం వలన క్యాన్సర్‌తో పాటు మహిళల్లో అనేక రుగ్మతలు తలెత్తుతాయి’ అని తెలిపారు.