టీఇండియా బౌల‌ర్ ష‌మి ఎపిసోడ్లో …ఊహించ‌ని ట్విస్ట్.! #ష‌మి భార్య మొద‌టి భ‌ర్త ఇంట‌ర్వ్యూ.!

టీం ఇండియా బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మి ఎపిసోడ్ లో మ‌రో కొత్త ట్విస్ట్ బ‌య‌ట‌ప‌డింది .. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు ష‌మి మీదే అనుమానాలు వ్య‌క్తమైన నేప‌థ్యంలో… ABP ప్ర‌సారం చేసిన ఓ ఇంట‌ర్వ్యూ తో ఇప్పుడు ష‌మి భార్య హ‌సీన్ జ‌హాన్ మీదే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఇంత‌కీ ఆ ఇంట‌ర్వ్యూలో ఏముంది..?

ష‌మి భార్యకు గ‌తంలోనే వివాహమైంద‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే…అయితే తాజాగా ష‌మి భార్య హ‌సీన్ మొద‌టి భ‌ర్త సైఫుద్దీన్ ఇంట‌ర్వ్యూను టెలికాస్ట్ చేసింది ABP న్యూస్… ఈక్ర‌మంలో ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌టికొచ్చాయి. 2010 లోనే హ‌సీన్ కు సైఫుద్దీన్ కు విడాకులయ్యాయ‌ట‌.. వీరిద్ద‌రికి ఇద్ద‌రు కూతుర్ల‌ట‌…పెద్ద‌కూతురు 10 వ త‌ర‌గ‌తి , చిన్న కూతురు 6 వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నార‌ట‌.! ఇప్ప‌టికీ హసీన్ పెద్ద కూతురుతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటుంద‌ట‌.!

ప్ర‌స్తుతం కిరాణా షాప్ న‌డుపుకుంటున్న సైఫుద్దీన్…హ‌సీన్ గురించి ఎక్క‌డా పాజిటివ్ గా మాట్లాడలేదు.అస‌లు ఈ అంశంపై స్పందించడానికి కూడా అంత‌గా ఇంట్ర‌స్ట్ చూప‌డంలేదు.టెన్త్ క్లాస్ లో ఉన్న‌ప్పుడు ఆమెను చూసి తానే మొద‌ట‌గా ప్ర‌పోజ్ చేశాన‌ని, ఆ త‌ర్వాత మా పెళ్ళి అయ్యింది, మాకు ఇద్ద‌రు కూతుర్లు..కానీ ఏమ‌య‌యిందో ఏమో….విడాకులు కావాలంది..ఈ క్ర‌మంలో 2010 లో మేమిద్ద‌రం విడాకులు తీసుకున్నామ‌ని చెప్పుకొచ్చాడు సైఫ్.!

ఈక్ర‌మంలోనే ష‌మి ఇంట్లో చిన్న చిన్న గొడ‌వ‌లు స్టార్ట్ అయిన‌ట్టు తెలుస్తుంది. ఎంతో ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉన్న ష‌మి , అప్ప‌టికే ఇద్ద‌రు కూతుర్ల‌కు త‌ల్లైన మ‌హిళ‌ను వివాహం చేసుకోవ‌డం ఇష్టంలేని ష‌మి పేరెంట్స్ ..హ‌సీన్ అంటే మొద‌ట్లో అంత ఇష్టం చూపేవారు కాద‌ట‌! ఆ ఇష్యూ యే తాజాగా ష‌మిమీద కేసు వ‌రకు వెళ్ళిందా.? లేదా…దీని వెనుక నిజంగానే ష‌మి ఆట‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతుందా..? అనేది మాత్రం తేలాల్సి ఉంది.!!

Watch Video:

Comments

comments

Share this post

scroll to top