భారత క్రికెటర్ మహమ్మద్ షమీని చుట్టు ముట్టిన వివాదాలు ఇప్పట్లో సద్దు మణిగేలా కనిపించడం లేదు. షమీ భార్య హసిన్ జహాన్ షమీపై ఆరోపణలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కథ అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. ఒక దశలో షమీ తాను మంచివాడినే అంటాడు, మరో దశలో అతని భార్య మాత్రం షమీకి ఉన్న అక్రమ సంబంధాల గురించి చెబుతుంది. ఇలా కథ ఎక్కడో మొదలై ఎటో తిరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు మనకు కొత్త కొత్త విషయాలు దీనికి సంబంధించి తెలుస్తూనే ఉన్నాయి. తాజాగా వీరి వివాదానికి చెందిన మరో కొత్త విషయం బయటకు తెలిసింది. అదేమిటంటే..
మహమ్మద్ షమీ, తన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలసి తనను చంపాలని చూసే వారని, షమీ తనకు నిద్రమాత్రలు ఇచ్చి చంపాలని చూశాడని, అందుకు అతని సోదరున్ని అతను పురమాయించేవాడని హసిన్ జహాన్ చెప్పింది. నిద్రమాత్రలను ఇచ్చి తనను చంపాల్సిందిగా షమీ అతని సోదరుడికి చెప్పే వాడని ఆమె తెలిపింది. దీంతో కేసు మరో కొత్త మలుపు తిరిగింది. అయితే పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కొత్త సెక్షన్ల కింద షమీ, అతని కుటుంబ సభ్యులపై కేసులను నమోదు చేస్తూనే ఉన్నారు.
మరో వైపు షమీ మంచివాడని, తమకు తెలిసి అతను అలాంటి పనులు చేయడని ధోనీ సహా పలువురు క్రికెటర్లు కూడా షమీకి మద్దతు పలికారు. కాగా హసిన్ ఓ దశలో షమీతో చర్చకు ఒప్పుకుందని, దీంతో వివాదం సద్దుమణగవచ్చని కూడా తెలిసింది. అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా షమీ విషయం మాత్రం రాను రాను బాగా క్లిష్టతరమవుతుంది. ఇక ఈ కేసు నుంచి అతను బయట పడతాడా, ఈ వివాదానికి ముగింపు ఎప్పుడు వస్తుంది అనేది మనకు త్వరలో తెలుస్తుంది.