క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీకి యాక్సిడెంట్‌. ష‌మీ కారును ఢీకొన్న ట్ర‌క్కు. ప్రస్తుతం ఎలా ఉన్నాడంటే.?

క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, అత‌ని భార్య హ‌సిన్ జ‌హాన్‌ల మ‌ధ్య నెల‌కొన్న వివాదం రోజుకో మ‌లుపు తిరుగుతున్న‌ద‌న్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట్లో త‌న భ‌ర్త‌కు, పాక్ అమ్మాయిల‌కు జ‌రిగిన సంభాష‌ణ అంటూ హ‌సిన్ జ‌హాన్ కొన్ని స్కీన్ షాట్ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేయ‌డంతో క‌ల‌క‌లం రేగింది. ఇక అప్ప‌టి నుంచి ఆమె ష‌మీపై ఏదో ఒక ర‌కంగా దాడి చేస్తూనే ఉంది. ఓ ద‌శలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు కూడా చేయ‌డంతో వాటి నుంచి ష‌మీ తాజాగా ఎలాగో బ‌య‌ట ప‌డ్డాడు. దీంతో అత‌నికి బీసీసీఐ క్లీన్ చిట్ ఇచ్చి య‌థావిధిగా ఈ ఏడాదికి గాను కాంట్రాక్టును అందజేసింది. దీంతో ష‌మీకి కొంత ఊరట ల‌భించింది.

అయితే బీసీసీఐ కాంట్రాక్టు ద‌క్క‌డం ద్వారా ష‌మీకి ఊర‌ట ల‌భించినా త‌న భార్య త‌న‌పై చేసిన వేధింపుల ఆరోప‌ణ‌లు మాత్రం ష‌మీని విడిచి పెట్ట‌డం లేదు. దీంతో ష‌మీ ఓ ర‌కంగా తీవ్ర‌మైన మాన‌సిక ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. అయితే అదే కార‌ణంగా భావిస్తున్న త‌రుణంలో ష‌మీకి తాజాగా రోడ్ యాక్సిడెంట్ కూడా అయింది. ఈ నెల25వ తేదీన ఆదివారం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి కారులో వెళ్తున్న ష‌మీ ప్ర‌మాదానికి గుర‌య్యాడు. అత‌ను ప్ర‌యాణిస్తున్న కారును ట్ర‌క్కు ఢీకొట్టింది. దీంతో అత‌ని త‌ల‌కు గాయాల‌య్యాయి.

అయితే కారు ప్ర‌మాదం నుంచి ష‌మీ సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డాడు. స్వ‌ల్ప గాయాలే కావ‌డంతో ప్ర‌స్తుతం అత‌ను డెహ్రాడూన్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. త‌రువాత ఢిల్లీకి ష‌మీ వెళ్ల‌నున్నాడు. అయితే భార్య త‌నపై ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో వాటి వ‌ల్ల తీవ్రంగా కుంగిపోయిన ష‌మీ ఆ మానసిక వేద‌న నుంచి బ‌య‌ట ప‌డ‌డం లేద‌ని, అందువ‌ల్లే ఆ ఆలోచ‌న‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ మ‌రో లోకంలో ఉండి కారు డ్రైవ్ చేయ‌డం వల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని ప‌లువ‌రు భావిస్తున్నారు. ఏది ఏమైనా ష‌మీకి ప్ర‌స్తుతం గ‌డ్డుకాలం న‌డుస్తుంద‌నే చెప్ప‌వ‌చ్చు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top