టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమిపై అతడి భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. షమికి పలువురు మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని, షమి కుటుంబ సభ్యులంతా కలిసి తనను హింసిస్తున్నారని..ఈ మేరకు కోల్కతా పోలీస్ కమిషనర్ కు ఆదారలతో సహా ఫిర్యాదు చేసింది హసీన్..!
2014 జూన్ 6న షమి, హాసీన్ లకు వివాహమయ్యింది. 2015 జులైలో వారికి ఆడపిల్ల పుట్టింది. పెళ్ళైన కొన్ని నెలకే షమి వ్యవహారాల గురించి తెలిసినా, ఊరికే ఉండక తప్పలేదని.. అతి కష్టం మీద అతని సెల్ ఫోన్ లాక్ ను చేధించానని…దానిలో ఉన్న వాట్సాప్ ఛాట్ చూసి షాక్ కు గురయ్యానని…అన్ని ఆధారలతోనే కంప్లైట్ చేసినట్టు చెప్పుకొచ్చింది హసీన్.! షమి పాకిస్థాన్ కు చెందిన మరో మహిళను కూడా వివాహం చేసుకున్నాడని ఆరోపించింది హసీన్.
ఆరోపణలపై స్పందించిన షమి.
నా వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నా పేరును ఆటను దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర ఇది, ఈ ఆరోపణల వెనక ఎవరి హస్తమో ఉంది. నా భార్యతో మాట్లాడేందుకు ప్రయత్నించా. కానీ ఆమె నా ఫోన్ ఎత్తట్లేదు. ఈ సమస్య త్వరగానే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నా. నా భార్యతో అనుబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నా’’నని అన్నారు షమి.
బీసీసీఐ కాంట్రాక్ట్ నుండి షమి ఔట్.
బీసీసీఐ కొత్తగా ప్రకటించిన కాంట్రాక్ట్ జాబితాలో మహ్మద్ షమి చోటు కోల్పోయాడు. ఏ+, ఏ, బి, సి విభాగాల్లో మొత్తం 26 మంది క్రికెటర్లను బోర్డు ఎంపిక చేసింది. ఇందులో ఏ విభాగంలోనూ షమికి చోటు లభించలేదు. షమిపై అతడి భార్య ఆరోపణల నేపథ్యంలోనే బోర్డు అతడి పేరును కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం.