వేలిముద్ర వెధవలిచ్చిన తీర్పిది…!

ఆ ఇద్దరు స్త్రీలను రేప్ చేయండి, ఆ తర్వాత నగ్నంగా ఊరేగించండి.. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామంలో  వేలిముద్ర వెధవలు ఇచ్చిన తీర్పు. తప్పు చేస్తే శిక్ష వేయడం సహజం, కానీ ఇలాంటి శిక్షనా? అయినా శిక్ష వేయాల్సింది  న్యాయస్థానం. కానీ  అక్షరం ముక్క రానీ ఊరి పెద్దలు కాదు. కానీ   అక్కడ  వారే పోలీసులు, వారిచ్చేదే తీర్పు…. వారు ఎంతంటే అంత.. ఏదంటే అది..  ఆ అహంకారంతోనే ఇటువంటి కిరాతక తీర్పిచ్చారు ఆ గ్రామపెద్దలు

విషయంలోకి వెళితే… ఉత్తరప్రదేశ్‌ భాగ్‌ పట్‌ జిల్లాలోని ఓ గ్రామంలో రవి అనే అబ్బాయి  జాట్‌ కులానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ  పెద్దలను ఎదిరించే ధైర్యం లేక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేక పోయాడు. అంతలోనే ఆ అమ్మాయికి వేరొకరితో పెళ్లి అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి భర్తతో కాపురం చేయడం ఇష్టం లేక.. రవి దగ్గరికే వచ్చింది.. భర్త తో కాపురం చేయడం ఇష్టం లేదని, నువ్వంటేనే ఇష్టం అని చెప్పింది.. దీంతో రవి,  ఆ అమ్మాయిని  పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అసలు పరిస్థితిని వివరించేలోపే గ్రామ పెద్దలు అదే పోలీస్ స్టేషన్ కు వెళ్లి అతడిపై తప్పుడు కేసులు బనాయించారు.

Capture

అంతటితో ఆగని గ్రామపెద్దలు… రవి సోదరి మీనా, అమె స్నేహితురాలపై అత్యాచారం చేయాలని ఆజ్ఞలను జారీ చేశారు. ఇద్దరమ్మాయిలకు  నల్లరంగు పూసి గ్రామంలో నగ్నంగా ఊరేగించాలని తీర్పు చెప్పారు. దానితో రవి కుటుంబం ఊరు విడిచిపెట్టి ఢిల్లీకి పారిపోయింది. రవి సోదరి మీనా ఈ విషయం పై  సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

గ్రామాలు బలోపేతం కావాలంటే అధికారం గ్రామ ప్రజల చేతిలో ఉండాలి కానీ ఇలా కాదు…. స్త్రీ మానానికి, ప్రాణానికి రక్షణగా ఉండాల్సిన పెద్ద మనుషులే రాక్షసుల రూపంలో భక్షించాలని చూడడం  అమానుషం.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top