100% లవ్ తమిళ్ రీమేక్ లో “తమన్నా” ప్లేస్ లో నటిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? 1st సినిమాతో తెలుగులో హిట్ కొట్టి.!

షాలిని పాండే అర్జున్ రెడ్డిలో తన నటనతో అందరిని ఫిదా చేసింది..అంతేకాదు ఆ సినిమాతో మరిన్ని ప్రాజెక్ట్ లో అవకాశాలు కొట్టేసింది.వాటిల్లో ప్రముఖమైనది సావిత్రి బయోపిక్ మహానటి.ఇప్పుడు 100% కాదల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది..తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య,తమన్నా కాంభినేషన్లో వచ్చిన 100% లవ్ మూవీ ఎంత పెద్ద హిట్టో మన అందరికీ తెలుసు..అందులో మహాలక్ష్మిగా తమన్నా అదరగొట్టింది..ఇప్పుడు అదే పాత్రలో కనిపించబోతుంది షాలిని పాండే.

సినిమా ఫీల్డ్ లో షాలిని ఈ స్థాయికి రావడానికి ముందు ఎన్నోకష్టాలు పడింది..నిద్రలేని రాత్రులేకాదు..ఒక పూట మాత్రమే తిండి తిన్న రోజులు షాలిని జీవితంలో ఉన్నాయి.ఉండడానికి చోటు దొరక్క ఇద్దరు అబ్బాయిలతో ఫ్లాట్ పంచుకుని ఆ విశేషాలు అందరితో చెప్పి ఇటీవలే బాద పడింది షాలిని..డబ్బులు లేక ప్రతిచోటుకి నడుచుకుంటూనే వెళ్లేదట .ఈ కష్టాలన్ని కూడా  తన తండ్రి తనను సినిమాలకు వెళ్లొద్దనడమే..అందుకే మొండి పట్టుదలతో ఇంటి నుండి వచ్చేసి ,తనంతట తానుగా అవకాశాలు వెతుక్కుంది.అర్జున్ రెడ్డిలో శాలిని నటన అద్బుతం..ఎంతలా అంటే ఇప్పుడు అందరూ తనని తన సొంత పేరుతో కాకుండా బేబీ,ప్రీతి అని పిలిచేంత పాపలర్ అయింది షాలిని.ఆ సినిమా తర్వాత నాన్న దగ్గర నుండి ప్రశంసలు అందుకుంది..మహానటిలో అవకాశం రావడం అంటే విషయం కాదు.ఇప్పటికే ఆ సినిమా కోసం తెలుగు సినీ ప్రపంచం ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తుంది.ఆ సినిమాలో ఛాన్స్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటే షాలినికి ఛాన్స్ రావడం నిజంగా అదృష్టమే..ఇప్పుడు 100% కాదల్ సినిమాలో  జివి ప్రకాశ్ సరసన మహాలక్ష్మి గా నటిస్తుంది.జీవి ప్రకాశ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎ ఆర్ రెహమాన్ మేనల్లుడు.ఈ సినిమాకి సంభందించిన ఫస్ట్ లుక్ తోనే షాలిని అదరగొట్టింది అని చెప్పొచ్చు.తమన్నా నడుముపై రాసుకున్న గణిత లెక్కలను చైతు ఎలా కాపీ కొట్టాడో తెలిసిందే. ఇప్పుడు రీమేక్ పోస్టర్ లో కూడా జీవి.ప్రకాష్ కుమార్ కూడా షాలిని పాండే నడుముపై ఉన్న ఫార్ములాలను తన స్టైల్ లో కాపీ కొట్టేస్తున్నాడు….చూసి మీరు చెప్పండి షాలిని లుక్ ఎలా ఉందో…

Comments

comments

Share this post

scroll to top