ష‌ర్ట్‌ల‌కు పాకెట్స్‌ ఎడ‌మ వైపుకే ఎందుకు ఉంటాయో తెలుసా..?

ప్ర‌పంచంలో ఉన్న దాదాపు అధిక శాతం వ‌స్తువులు కుడి చేతి వాటం ఉన్న వారిని దృష్టిలో ఉంచుకుని త‌యారు చేసిన‌వే. ఉదాహ‌ర‌ణ‌కు కంప్యూట‌ర్ మౌస్‌నే తీసుకోండి. దాన్ని సాధార‌ణంగా ఎవ‌రైనా కుడి చేయి వైపు ఉంచుకునే ఆప‌రేట్ చేస్తారు. అందుకు అనుగుణంగానే దాని బ‌ట‌న్లు కూడా ఉంటాయి. కారు లాంటి వాహ‌నాలు కూడా అంతే. కుడి చేయి వారికి అనువుగా ఉంటాయి. ఇంకా ముందుకు వెళితే ఇలాంటివి మ‌న‌కు అనేకం క‌న‌బ‌డ‌తాయి. అయితే అలాంటి వాటిలో చొక్కా కూడా ఒక‌టి. అవును, అదే. చొక్కాలు కూడా కుడి చేతి వారిని ఉద్దేశించుకునే డిజైన్ చేయ‌బ‌డ్డాయి. ముఖ్యంగా వాటికి ఉండే పాకెట్స్‌. అవి ఎప్పుడూ ఎడ‌మ వైపుకే ఉంటాయి. దీంతో అవి కుడి చేతి వాటం వారికి అనువుగా ఉంటాయి. అయితే చొక్కాల‌కు ఎప్పుడూ జేబులు ఎడ‌మ వైపుకే ఎందుకు ఉంటాయో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

పైన ఇంత‌కు ముందే చెప్పాం క‌దా. కుడి, ఎడ‌మ చేతి వాటాల గురించి. ఆ… అదే. దాన్ని దృష్టిలో ఉంచుకునే చొక్కా జేబుల‌ను కూడా ఎడ‌మ వైపుకే పెట్ట‌డం ప్రారంభించారు. అంటే అది, ఎడ‌మ చేతి వాటం క‌లిగిన వారిని దృష్టిలో ఉంచుకుని కాదు, కుడి చేతి వాటం ఉన్న వారిని దృష్టిలో ఉంచుకుని చొక్కా జేబుల‌ను అలా ఎడ‌మ వైపుకు పెట్ట‌డం ప్రారంభించారు. ఎందుకంటే, ప్ర‌పంచంలో ఎక్కువ‌గా ఉన్న‌ది కుడి చేతి వాటం వారే కావ‌డం, వారికి చొక్కా జేబు ఎడ‌మ వైపు ఉంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుండ‌డంతో అలా జేబుల‌ను ఎడ‌మ వైపుకు పెట్టి కుట్ట‌డం ప్రారంభించారు. అలా అది కొన‌సాగుతూ వ‌స్తోంది.

అయితే మ‌రి ఎడ‌మ చేతి వాటం ఉన్న వారి ప‌రిస్థితి ఏంట‌ని మీరు అడిగితే, అలాంటి వారి కోస‌మే కొన్ని కంపెనీలు రెండు జేబులు ఉన్న చొక్కాల‌ను త‌యారు చేయ‌డం షురూ చేశాయి. దీంతో అవి రెండు చేతి వాటాలు క‌ల వారికి ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌డ‌మే కాదు, ఫ్యాష‌న్‌గా కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలో అలాంటి చొక్కాల‌ను అధిక శాతం మంది వేసుకుంటున్నారు. అయితే చొక్కా ఎడ‌మ వైపుకు జేబులు ఉండ‌డం వెనుక మ‌రో కార‌ణం ఉంద‌ని ప‌లువురు చెబుతారు. అదేమిటంటే.. ఆ జేబులో లోహ‌పు వ‌స్తువులు ఏమైనా పెట్టుకుంటే అవి మన గుండెను ర‌క్షిస్తాయ‌ట‌. బుల్లెట్లు, ఇత‌ర చిన్న‌పాటి ప‌దునైన వ‌స్తువులు నేరుగా లోప‌లికి వెళ్ల‌కుండా అవి అడ్డుకుంటాయ‌ట‌. అందుకనే అలాంటి లోహ‌పు బిళ్లలు, కాయిన్స్ వంటి వాటిని పెట్టుకునేందుకు వీలుగా చొక్కాల‌కు ఎడ‌మ వైపున జేబులు పెట్టార‌ట. ఇవీ.. ఈ విష‌యం వెనుక ఉన్న కార‌ణాలు..!

Comments

comments

Share this post

scroll to top