దేశ సరిహద్దులో కాపలా కాసే రోబోని తయారుచేసిన పదిహేడేళ్ల కుర్రాడు..

వంట చేసే రోబోలు,ఇంట్లో పనులు చేస్తూ ఇంటికి కాపలా కాసే రోబోల గురించి విన్నాం కానీ దేశ సరిహద్దుల్ని కాపలా కాసే రోబోట్ గురించి విన్నారా..అది తయారు చేసింది పదిహేడేళ్ల కుర్రాడు..ఆడుతు పాడుతు అల్లరిగా తిరుగుతూ రోబోట్ల తో ఆడుకోవాల్సిన వయస్సులో దేశ రక్షణ గురించి ఆలోచించి రోబోని తయారు చేసి మహా మహా సైంటిస్టులకు సవాల్ విసిరాడు.

రోబో తయారు చేయాలన్న ఆలోచన ఎలావచ్చింది?

నీల్మాధబ్ చిన్నప్పటి నుంచీ సైన్స్ అంటే పడిచచ్చేవాడు. ఎప్పుడు చూసినా సైన్స్ రిలేటెడ్ టాయ్స్ తయారుచేస్తూ కనిపించేవాడు. మూడో తరగతిలోనే తన మొట్టమొదటి సైన్స్ ప్రాజెక్ట్ సొంతంగా చేశాడు. ఆరో క్లాసులో ఉండగా అతని హ్యుమనాయిడ్ రోబో తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. అప్పుడంత మెచ్యూరిటీ లేక విఫలమయ్యాడు. ఎప్పటికైనా రోబోని తయారుచేసి చరిత్ర సృష్టించాలని అప్పడే అనుకున్నాడు…

ఆటమ్ 3.7 రోబో తయారి,ఖర్చు..

ఒడిసాలోని తలానగర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న నీల్మాధబ్ ఏడాది కాలంగా రోబో తయారీలో నిమగ్నమయయ్యాడు. ఆర్టిఫీషియల్ ఆల్గారిథం ఆధారంగా హ్యుమనాయిడ్ రోబో తయారు చేశాడు. ఆటమ్ 3.7 అనే ఈ రోబో బోర్డర్ లో సైనికుడిలాగే కాదు..ఇతర రంగాల్లోనూ ఆరితేరింది. కావల్సిన వినోదాన్ని అందిస్తుంది. ఎడ్యుకేట్ చేస్తుంది. మాన్యుఫ్యాక్చరింగ్, డొమెస్టిక్ సర్వీసులు కూడా అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆటమ్ 3.7 రోబో మనం ఏం చెబితే అది చేస్తుంది.ఈ ప్రాజెక్టుకు అయిన ఖర్చు దాదాపు నాలుగు లక్షలు. రోబో ఎత్తు 4.7 అడుగులు. బరువు 30 కిలోలు. 14 సెన్సర్లు, ఐదు రిమోట్ కంట్రోల్ సిస్టమ్స్ ద్వారా రోబో పనిచేస్తుంది.

తండ్రి ప్రోత్సాహం..

వయసుకు మించి కష్టపడుతున్నాడని కొంచెం బాదపడినప్పటికి కూడా.. కుర్రాడి పట్టుదల చూసి ముచ్చపడ్డ ప్రొసీడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నీల్మాధబ్ తండ్రి. ఎంత ఖర్చయినా భరిస్తా.. ఆకాశమే హద్దుగా దూసుకుపో అని భుజం తట్టాడు.ఇక ఇంటర్నెట్ సాయంతో బుర్రకు మరింత పదును పెట్టాడు. నీల్మాధబ్ తయారుచేయాలనుకున్న మల్టీపర్పస్ రోబో ఖర్చు ఊహించదానికంటే ఎక్కువే అవుతుంది. అందుకే రోబోటిక్స్ రంగంలో ఉన్నత చదువులు చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రోబో ఒక్కటే కాదు.. మహిళల భద్రత కోసం ప్రత్యేకమైన డ్రోన్ కూడా తయారుచేయాలన్న ఆలోచన అతని మనసులో బలంగా ఉంది.

Comments

comments

Share this post

scroll to top