టీవీ హీరోయిన్ సూసైడ్ నోట్‌లో ఏముందంటే…? ఆమెలా ఎందరో..!

Krishna

ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయిలు అవకాశాలు రాకపోతే ఎన్నుకునే ఏకైక మార్గం ఆత్మహత్య. ఇప్పటివరకు ఎందరో నటులు అవకాశాలు రాకో,ఒత్తిడివల్లో ఆత్మహత్య  బాట పట్టారు.కొందరి చావులకు కారణాలే తెలీవు.మరికొందరి మృతికి కారణాలు తెలిశాక అయ్యో అనుకోవడం తప్ప ఏం చేయలేం..ఇటీవలబెంగాళీ టీవీ నటి మౌమితా సాహా రెండు రోజుల క్రితం కోల్‌కతాలోని తన ప్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ లో విషయాలను బట్టి డిప్రెషన్ వలనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్దారించారు.మౌమితా సాహా లానే ఆత్మహత్యకి పాల్పడిన కొందరు టివి నటులు.

ప్రత్యూష బెనర్జీ

హిందీ టీవీ సీరియల్ బాలిక వధుతో పాపులర్ అయిన ప్రత్యేష బెనర్జీ ముంబైలోని తన ఫ్లాట్‌లో 2016లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పట్లో ఆమె ఆత్మహత్య పెద్ద వివాదానికి కారణమైంది. తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ తో సమస్యలే ఆమె ఆత్మహత్యకు కారణమనే వార్తలు వినిపించాయి.చిన్నారి పెళ్లికూతురుగా ఈ సీరియల్ తెలుగులో బాగా ఫేమస్..అందుకే ప్రత్యూష చనిపోయినప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా బాదపడ్డారు.

నఫిసా జోసెఫ్

ఎంటీవీ వీడియో జాకీ నిఫిసా 2004లో తన ఫ్లాట్ లో పెళ్లికి కొన్ని వారాల ముందు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన డిస్ట్రబెన్స్ వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.

కుల్జీత్ రండవా

మరో టీవీ నటి కుల్జీత్ రండవా 2008 ఫిబ్రవరిలో ఆత్మహత్యకు పాల్పడింది. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒత్తిడి భరించలేకనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆమె తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

బిడిషా బెజ్బారు

అస్సామీ టీవీ నటి, సింగర్ బిడిషా 2017 జులైలో గురుగ్రామ్‌లోని తన ప్లాట్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణంపై అప్పట్లో అనేక ఆరోపణలు వినిపించాయి. తమ కూతురిది ఆత్మహత్య కాదని, హత్య అని బిడిషా తల్లిదండ్రులు ఆరోపించారు.

దిశా గంగూలీ

మరో బెంగాళీ టీవీ నటి దిశా గంగూలీ కూడా 2015 ఏప్రిల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. ఆవిడ సేమ్ సెక్స్ రిలేషన్ వల్ల సమాజం నుండి ఎదుర్కొన్న ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. దిశా గర్ల్ ఫ్రెండ్ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కొందరు ఆమెను సేవ్ చేశారు.

Comments

comments