ఒకప్పటి ఈ 9 మంది “ఈటీవి సీరియల్” ఆర్టిస్టులు గుర్తున్నారా..? ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?

స్నేహా…స్నేహ స్నేహ…చిక్కుముడులెన్నో చక్కగ విప్పే ఒకే ఒక వనితా….

లేడీ డిటెక్టివ్ అమ్మోయమ్మా యాక్టివ్…

అంతరంగాలు అనంత మానస చదరంగాలు..అంతే ఎరుగని ఆలోచనలా సాగరాలు…

అన్వేషితా…అన్వేషితా…క్షణం క్షణం ప్రకంపణం..

ఎండమావులే నీ గుండెలోని ఆశలు..ఎండమావులే నీ మనసులోని కోర్కెలు…

చదువుతుంటే..కాదు కాదు పాడుతుంటే ఒక్కసారిగా గతంలోకి వెళ్లిపోయారు కదా..ఇవేవి సూపర్ హిట్ సినిమా సాంగ్స్ కాదు.మన తెలుగు సీరియళ్ల పాటలు..ఇప్పుడంటే మూస కథలతో ,సాగదీత తో..రెండు నిమిషాల సీరియల్ కు పదినిమిషాల యాడ్స్ తో ,ఎంత సేపూ అత్తా కోడళ్ల కొట్లాటలు,కుట్రలతో సీరియళ్లంటేనే ఏవగింపు కలుగుతుంది కానీ..ఒకప్పుడు సీరియల్స్ ఇలా లేవు ఇంటిల్లిపాది కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్లు.అవి కూడా ఒక్కో సీరియల్ ఒక్కొ డిఫరెంట్ కాన్సెప్ట్..పాత్రలు,సన్నివేషాలు ప్రతిదీకూడా ప్రేక్షకున్ని కట్టిపడేసేవి..ఆఖరుకి సీరియళ్ల పాటలు కూడా..అందుకే పైన నేను రాసిన పాటలు అప్రయత్నంగానే మనం పాడేసుకున్నాం.ఇప్పుడు కొంచెం సీరియళ్స్ లో క్వాలిటీ తగ్గింది కానీ ఒక ప్పుడు ఈ టీవి సీరియళ్లకు పెట్టింది పేరు..వాటిల్లో కొన్నే లేడీడిటెక్టివ్, స్నేహ, అన్వేషితా, అంతరంగాలు,ఎండమావులు..ఇంకా మరికొన్ని..ఆ సీరియల్లు ఆ పాత్రలు ,ఆ పాత్రల్లో నటించిన వారు ఇప్పటికీ మన కళ్లముందర మెదులుతుంటారు..ఇప్పుడు వారిలో కొందరు ఏం చేస్తున్నారో తెలుసుకుందామా..

ఉత్తర

ఉత్తర ప్రధాన పాత్ర పోషించిన లేడి డిటెక్టివ్ సీరియల్ ప్రేక్షకుల ఆదారాభిమానాలు పొందిన వాటిల్లో ఒకటి.ఈ సీరియల్ దర్శకుడు మరెవరో కాదు మన పసలపూడి వంశీ గారూ..వంశీ గారు డైరెక్ట్ చేసిన మొదటి సీరియళ్ ఇది.ఈ సీరియల్లో డిటెక్టివ్ గా ఉత్తర,ఆమె అసిస్టెంట్ గా సాక్షి రంగారావుగారు నటించారు..ఈ సీరియళ్ తర్వాత ఉత్తర నటనకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.లేడి డిటెక్టివ్ గా మాత్రం మన మనసుల్లో నిలిచిపోయింది.

కావేరి

స్నేహా సీరియల్ లో కూడా డిటెక్టివ్ పాత్ర లాంటిదే కానీ అన్ అఫిషియల్ డిటెక్టివ్ అన్నమాట.ఈ సీరియల్లో నటించిన కావేరి ..తర్వాత కొన్ని తమిళ సీరియల్స్ లో అక్క పాత్రలు చేసినప్పటికీ అంతగా క్లిక్ అవ్వలేదు .పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది కావేరి.

యమున

అన్వేషిత సీరియల్ ఒక సోషియో పాంటసీ.ఈ సినిమా పెద్దల్ని పిల్లల్ని కూడా అలరించింది.ఈ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించిన యమున ఇప్పటికీ సీరియళ్స్ మనకు కనపడుతుంది.అన్వేషితకి ముందు యమున టాలివుడ్లో సూపర్ హిట్ సినిమాలు చేసింది. తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినప్పటికీ విధి సీరియల్ యమునకు చాలా పేరు తెచ్చిపెట్టింది.ఇప్పుడు దానికి సీక్వెల ్ గా వస్తున్న సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియళ్ లో నటిస్తుంది యమున.

కల్పన

అంతరంగాలు సీరియల్ ద్వారా ఎంతో మంది నటీనటులు మన ఫేవరెట్ స్టార్స్ గా మారారు.శరత్ బాబు,కల్పన, అచ్యుత్,అశ్విని,కిన్నెర ఈ సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయ్యారు.అచ్యుత్ చిన్న వయసులో గుండెపోటుతో మరణించగా..కిన్నెర తర్వాత కొన్ని సీరియళ్స్ ,సినిమాలు చేస్తుంది.కల్పన కూడా ఆ సీరియల్ తర్వాత కొంతకాలం ఎలాంటి సినిమాలు కానీ సీరియళ్లు కానీ చేయలేదు.ఇప్పుడు తెలుగు సినిమాల్లో తల్లిపాత్రలు పోషిస్తుంది.

జ్యోతి రెడ్డి

ఎండమావులు సీరియల్ లో లీడ్ రోల్ పోషించిన జ్యోతిరెడ్డి ఇప్పటికీ సీరియల్స్ లో నటిస్తున్నారు.ఇప్పుడు మా టీవిలో వచ్చేఅష్టాచెమ్మా సీరియల్లో ఈమె నటిస్తుంది.ఈ సీరియల్తో హీరోయిన్ గా పరిచయం అయిన సుప్రతీక కి ఈ సిరియల్ మంచి పేరు తెచ్చిపెట్టినప్పటికీ దానితర్వాత పెద్దగా నటించినట్టు లేదు.

భావన,మీనాకుమారి

ఈ సీరియల్స్ వీళ్లు మాత్రమే కాదు.. అందం,కళంకిత లాంటి సీరియల్స్ కూడా మంచి ప్రజాధరణ పొందాయి అప్పట్లో..క్రిష్నప్రియ,భావన,మీనాకుమారి వీరంతా ఈ టీవి సీరియల్స్ ద్వారానే మంచి గుర్తింపు పొందారు.భావన,మీనాకుమారి ఇంకా కొనసాగుతున్నారు.క్రిష్ణప్రియ కొంచం గ్యాప్ ఇచ్చినట్టుంది..ఈ మధ్య ఎక్కడా కనపడట్లేదు.

 

 

 

Comments

comments

Share this post

scroll to top