ఇకపై టీవీ షోలకు సెన్సార్ వర్తిస్తుంది..!

ఒకప్పుడు అశ్లీలత అనేది ఆంగ్ల చిత్రాల్లోనే ఉండేది, మెల్లగా హిందీ సినిమాల్లో కూడా అశ్లీల సన్నివేశాలు కనిపించడం మొదలయాయ్యి. తరవాత తెలుగు సినిమాల్లో కూడా సర్వ సాధారణం అయిపొయింది. కుటుంబసమేతంగా సినిమాకి వెళ్లాలనుకునేవారు పిల్లల్ని తీసుకొని వెళ్లాలా వద్ద అని ఆలోచించుకొని సినిమాలకు వెళ్లే పరిస్థితి వచ్చేసింది. సినిమాకి ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాములే అనే వదిలేస్తాము. కానీ మనం ప్రతి రోజు చూసే బుల్లి తెర కార్యక్రమాల్లో కూడా అశ్లీల మాటలు ఎక్కువైపోతున్నాయి. ముక్యంగా “జబర్దస్త్, పటాస్”. “పటాస్” షోలో “శ్రీముఖి, రవి” లు ఒకర్ని మించి ఒకరు శృతి మించుతున్నారు..

వెండితెర మీద ప్రదర్శించే సినిమాలకు తప్పనిసరిగా సెన్సార్ ఉంటుంది. కాని బుల్లి తెరమీద ప్రసారమయ్యే సీరియల్స్, రియాల్టీ షోలకు ఎటువంటి సెన్సార్, స్క్రీనింగ్ ఉండదు. దీంతో బుల్లి తెరపై ఒక్కొక్కరు పోటీలుపడి రెచ్చిపోతున్నారు. అబ్బో ఆ వరస్ట్ ఎపిసోడ్స్ గురించి చెప్పాలంటే చాలా దారుణమనే అనాలి. ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూడలేని విధంగా స్మాల్ స్క్రీన్ షోలు, ఎపిసోడ్లు మారిపోయాయి. మరీ చిన్నారులు ఆ సీన్స్, సీరియల్స్ చూస్తే వారి భవిష్యత్ ఏమయిపోతుందోనని తల్లిదండ్రులు వణికిపోతున్నారు. రియాల్టీ షోల్లో బూతులు రాజ్యమేలుతుంటే సీరియల్స్ కుట్రలు, కుతంత్రాలు, క్రైం సీన్లతో నిండిపోయాయి. అందుకే చాలా కాలంగా బుల్లి తెరకు కూడా సెన్సార్ ఉండాలనే డిమాండ్ వస్తోంది. అయితే..

సెన్సార్ బుల్లి తెరకు సాధ్యం కాదని అంతా భావించారు. అయితే ఇటీవల మరీ శృతిమించి కార్యక్రమాలు ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెన్సార్ బుల్లి తెరకు రావాల్సి వస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్ వారు స్వయంగా బుల్లి తెరకు కూడా సెన్సార్ ను తీసుకురావాలని నిర్ణయించారు. టీవీల్లో ప్రసారమయ్యే ప్రతిదాన్ని కూడా సెన్సార్ చేయాల్సిందేనని, త్వరలోనే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఆ నిర్ణయం అమలు జరిగితే తెలుగులో జబర్దస్త్, పటాస్ షోలకు కత్తెర్లు పడ్డట్టే..

Comments

comments

Share this post

scroll to top