సీనియ‌ర్ ఒబామా (బ‌రాక్ ఒబామా తండ్రి) రాసిన ఆ లెట‌ర్‌లో ఏముందో తెలుసా..?

చ‌రిత్ర‌లో ఎప్పుడో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను గురించి తెలుసుకుంటున్నా, ఆ కాలంలో నివసించిన ప‌లువురు గొప్ప వ్య‌క్తుల జీవిత గాథల‌ను, లేదా ఇత‌రుల క‌థ‌ల‌ను చ‌దివినా మ‌న‌కు అదోలాంటి ఉత్సుక‌త, ఆస‌క్తి క‌లుగుతుంది. అప్ప‌ట్లో జ‌రిగిన ఆ క‌థ‌లు, సంఘ‌ట‌న‌లు ఇప్పుడు చ‌దువుతుంటే ఒకింత ఆశ్చ‌ర్యం కూడా క‌లుగుతూ ఉంటుంది. అలాంటి ఆశ్చ‌ర్యం క‌లిగించే ఒక‌ప్ప‌టి కాలానికి చెందిన ఓ లెట‌ర్ పట్ల ఇప్పుడు పాఠ‌కుల్లో ఎక్క‌డ లేని ఆస‌క్తి క‌లుగుతోంది. ఇంత‌కీ ఆ లెట‌ర్ ఏమిటి? దాన్ని ఎవ‌రు ఎవ‌రికి రాశారు? తెలుసుకోవాల‌నుందా, ప‌దండి మ‌రి, ఆ లెట‌ర్ క‌థేంటో చూద్దాం.

senior obama letter

బ‌రాక్ హుస్సేన్ ఒబామా… ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ పేరు అందరికీ చిర‌ప‌రిచిత‌మే. ఆయ‌న గురించి తెలియ‌ని వారు దాదాపుగా ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అమెరికాకు 44వ అధ్య‌క్షుడిగా ఈయ‌న 2008లో గెలుపొందారు. అమెరికా అధ్య‌క్ష పీఠాన్ని అధిరోహించిన మొద‌టి ఆఫ్రిక‌న్‌గా ఈయ‌న పేరుగాంచారు. ఈయ‌న జ‌న్మ‌స్థలం అమెరికానే అయినా తండ్రి సీనియ‌ర్ ఒబామాది మాత్రం కెన్యా. ఆయ‌న చ‌దువు కోసం అమెరికాకు వెళ్లి అక్క‌డే స్థిర‌ప‌డ‌డంతో బ‌రాక్ ఒబామా కూడా అక్క‌డే జ‌న్మించారు. కాగా సీనియ‌ర్ ఒబామాది స్వ‌త‌హాగ పేద కుటుంబం కావ‌డంతో ఆయ‌న చ‌దువుకు ఇబ్బంది క‌లుగుతూ ఉండేది. ఈ క్రమంలో పాఠ‌శాల విద్య‌ను ఆయ‌న ఎలాగోలా పూర్తి చేశాడు. అయితే కాలేజీ విద్య కోసం ఆయ‌న‌కు మ‌రింత డ‌బ్బు అవ‌స‌ర‌మైంది. దీంతో అమెరికాలో విద్య‌ను అభ్య‌సించ‌డం కోసం కెన్యాలో ఉన్న ఆఫ్రిక‌న్‌-అమెరిక‌న్ ఇనిస్టిట్యూట్‌కు ఆయన ఓ లేఖ రాశారు. త‌న కళాశాల చ‌దువు కోసం ఆర్థిక స‌హాయం కావాల‌ని అభ్య‌ర్థిస్తూ ఆ ఇనిస్టిట్యూట్‌కు లేఖ రాశారు. పైన మేం చెప్పిన లెట‌ర్ ఇదే.

అమెరికాలో ఉన్న ఎన్నో ఇనిస్టిట్యూట్స్‌కు తాను ద‌ర‌ఖాస్తు చేసుకున్నాన‌ని, వాటిలో కొన్నింటి నుంచి త‌న‌కు రిప్లై వ‌చ్చింద‌ని, వాటిలో ఏదో ఒక దాంట్లో తాను క‌ళాశాల విద్య‌ను అభ్య‌సించ‌ద‌లిచాన‌ని, అందుకు గాను త‌గిన స్కాల‌ర్ షిప్‌ను అందించాల‌ని సీనియ‌ర్ ఒబామా ఆ ఇనిస్టిట్యూట్‌కు లెట‌ర్ రాశారు. 1958వ సంవ‌త్స‌రం, అక్టోబ‌ర్ 20న ఆయ‌న లెట‌ర్ రాయ‌గా దాన్ని ఇనిస్టిట్యూట్ వారు అక్టోబ‌ర్ 27న అందుకున్నారు. కాగా ఇప్పుడీ లెట‌ర్ హ‌ర్లెంలో ఉన్న స్కాంబ‌ర్గ్ సెంట‌ర్ ఫ‌ర్ రీసెర్చ్‌లో క‌ల్చ‌ర్ బ్లాక్‌లో భ‌ద్రంగా ఉంది. దీన్ని ప‌లువురు ఇటీవ‌ల మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు. ఇప్పుడీ లెట‌ర్ ప‌ట్ల అమెరికా పౌరుల్లోనే కాదు దాదాపు అన్ని దేశాల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. అవును మ‌రి, అలాంటి ప్ర‌ముఖుల‌కు చెందిన ఏ విష‌య‌మైనా చ‌ర్చ‌నీయాంశ‌మే క‌దా!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top