పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నెగ్గుకొస్తాడని నాకు నమ్మకం లేదు – సీనియర్ హీరోయిన్ జమున గారు.!!

ఆ నాటి తరం లో సావిత్రమ్మ గారి తరువాత జమున గారంటే చాలా మందికి ఇష్టం. ప్రస్తుతం ఆ తరానికి నేటి తరానికి వారధి ఆమె. చాలా మంది హీరోయిన్స్ కి జమున గారే ఆదర్శం. “ప్రస్తుతం ఉన్న రాజకీయాలు వేరు, ఒకప్పటి రాజకీయాలు వేరు, అప్పట్లో ప్రజా సేవ చెయ్యడానికి ముందుకు వచ్చేవారు, ఇప్పుడు కోటి రూపాయిలు ఖర్చు పెట్టి పది కోట్లు సంపాదించడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు” అని జమున గారు అన్నారు.

చిరంజీవి కి చెబితే నవ్వి ఊరుకున్నాడు :

“నాకు చిరంజీవి తో ఉన్న చనువు వల్ల నేను అతనికి రాజకీయాల్లోకి రావొద్దు అని చెప్పాను, ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు. కానీ ఆ తరువాత ఏమైందో తెలుసు కధ అందరికి. అప్పట్లో రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ నన్ను రాజమండ్రి నుండి ఎంపీగా పోటీ చెయ్యమని కోరారు, వారి కోరికను కాదనలేక పోటీ చేశాను, అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి చాలా తేడా ఉంది”.అని చెప్పారు జమున గారు.

పవన్ కళ్యాణ్ నెగ్గుకొస్తాడని నాకు నమ్మకం లేదు :

“పవన్ కళ్యాణ్ తో నాకు పరిచయం లేదు, ఒక వేళ నాకు అతనితో పరిచయం ఉండి ఉంటే అతనితోనే నేరుగా చెప్పేదాన్ని రాజకీయాలు వద్దు అని, అతను రాజకీయాల్లో నెగ్గుకొస్తాడని నాకు నమ్మకం లేదు”. అని చెప్పారు జమున గారు

దేవుళ్ళ లాగా చూస్తారు :

సినిమా వాళ్ళను దేవుళ్ళ లాగ చూస్తారు జనాలు, దేవుళ్ళు రాజకీయాలు చెయ్యడం వారికి నచ్చదు. అందుకే జనాలు అంతగా మొగ్గుచూపట్లేదు సినీతారల పైన అని తెలిపారు జమున గారు.

 

Comments

comments

Share this post

scroll to top