“బాహుబలి” పై విమర్శల వర్షం కురిపించిన సీనియర్ నటుడు “కైకాల సత్యనారాయణ” గారు! 500 కోట్లు అనవసరమట!

గత రెండు సంవత్సరాల నుండి తెలుగు సినిమా ఫాన్స్ అందరికి ఉన్న కామన్ డౌట్ ఒక్కటే “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?”…రాజమౌళి “బాహుబలి” తో తెలుగు సినిమా లెవెల్ ని ప్రపంచ స్థాయికి పరిచయం చేసాడు…ప్రభాస్, రానా అయితే ఒక రేంజ్ లో ఫేమస్ అయిపోయారు…బాహుబలి – 2 కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు…ఏప్రిల్ 28 న ఈ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది!…ఇక తెలుగు సినిమాకి పండగ వచ్చినట్టే బాహుబలి రిలీజ్ అంటే! ఇటీవల విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది.

అయితే బాహుబలి సినిమా పేరు చెబితే.. సాహో బాహుబలి అనే మెజారిటీ ప్రేక్షకులు ఉన్నట్టే.. ఈ సినిమాకి అంత సీన్ లేదు అని విమర్శించే వారు అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు, కొంతమంది పెద్ద సెలెబ్రిటీలు కూడా అదే బాటలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా “బాహుబలి” పై విమర్శల వర్షం కురిపించారు ప్రముఖ నటుడు “కైకాల సత్యనారాయణ” గారు.

ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు వచ్చిన బాహుబలి మూవీని మీరు చూశారా.. అన్న యాంకర్ ప్రశ్నకు సమాధానంగా..

“ఆ సినిమాకు అంత పేరు దేనికి వచ్చిందో నాకు మీరు చెప్పండంటూ.. యాంకర్‌ను ఎదురు ప్రశ్నిస్తూనే.. అసహనం వ్యక్తం చేశారు కైకాల. ‘ఆ సినిమాలో మీరు చెప్పినంత గొప్పేంలేదు. అసలు ఆ సినిమాకి స్టోరీనే లేదు. కేవలం మూడు సెంటెన్స్‌లో కథ ముగుస్తుంది. అది గొప్ప సినిమా అయితే.. ఒక శారద.. ఒక శాతవాహన.. ఇవి గొప్ప సినిమాలు కావా?

500 కోట్ల పెట్టి సినిమా తీయడం గొప్ప విషయమా? ఆ ఐదొందల కోట్లతో 500 సినిమాలను జీవితం మొత్తం తీయవచ్చు. భారీ సెట్స్ , గ్రాఫిక్స్ , కాస్ట్యూమ్స్ తప్ప బాహుబలి సినిమాలో ఇంకైమైనా కనిపించాయా? తెలుగు మార్కెట్‌కు అంత ఖర్చుపెట్టడం అవసరమా? గొప్ప సినిమా అంటే.. కంటెంట్ పరంగా ఉండాలి. గ్రాఫిక్స్ కాదు.

అయినా ఇలాంటివి ఇప్పుడు కాదు ఎప్పుడో చేశాం.. ఇంగ్లీష్ మూవీస్ చాలా వచ్చాయి . అవే ఇప్పుడు మళ్లీ చూపిస్తున్నారు తెలుగులో.. వాటివల్ల సొసైటీకీ ఏమైనా ఉపయోగం ఉందా? కళ్లు జిగేల్ మనిపిస్తే గొప్పచిత్రం అయిపోద్దా అని ప్రశ్నించారు కైకాల. వేషాలు వేయకపోతే.. పరిశ్రమలో లేకపోతే నిన్న కాక మొన్న వచ్చిన హీరోలకు ఇచ్చిన గౌరవం కూడా సీనియర్ నటులకు ఇవ్వరనేది ముమ్మాటికీ నిజం అంటూ అసహనం వ్యక్తం చేశారు కైకాల సత్యనారాయణ.”

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top