బండ్ల గణేష్ పైన సంచలన కామెంట్స్ చేసిన ప్రకాష్ రాజ్.. చూస్తే నవ్వాపుకోలేరు.!!

బండ్ల గణేష్.. ఒకప్పుడు కమెడియన్ గా, ఆ తరువాత ప్రొడ్యూసర్ గా, ఇప్పుడు రాజకీయ వేత్త గా. బండ్ల గణేష్ ఇన్ని పాత్రలు నిజ జీవితం లో పోషించాడు, అసలు బండ్ల గణేష్ కి ప్రస్తుతం సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకి కూడా లేదంటే అతిశయోక్తి కాదు, అంటే అతన్ని గొప్పోడని సోషల్ మీడియా లో పొగడట్లేదు, పిచ్చోడని ట్రోల్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే 7’0 clock బ్లేడ్ తో గొంతు కోసుకుంటా అని చెప్పిన బండ్ల గణేష్, ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తరువాత కనుమరుగై పోయాడు.

ఒక పక్క బ్రహ్మి, మరో పక్క MEMES :

ఇంక సోషల్ మీడియా లో బండ్ల గణేష్ ను ఆడుకోడం షురూ చేసారు, తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన తెరాస పార్టీకంటే బండ్ల గణేష్ మీదనే ఎక్కువ MEMES పడ్డాయి సోషల్ మీడియా లో, బండ్ల గణేష్ ని సోషల్ మీడియా లో ట్రోల్ చేసిన MEMES లో ఎక్కువ శాతం బ్రహ్మానందం పిక్స్ ఏ వాడారు.

బండ్ల గణేష్ బ్లేడ్ ఇష్యూ మీద రియాక్ట్ అయిన ప్రకాష్ రాజ్ :

మోడీ కి వ్యతిరేకంగా గా మాట్లాడే ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ ని ఏకిపారేశారు, ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ : “బండ్ల గణేష్‌ ప్రాణం విలువ తెలుసుకోకుండా అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అయితే మీడియాలో సెన్సేషన్ కావడం కోసం నోటి కొచ్చినట్లు మాట్లాడితే, వాటిని ప్రసారం చేసిన మీడియా సంస్థలకు ఉపయోగం ఉంటుంది, టీఆర్పి వస్తుంది చానెల్స్ కి, ఎక్కువ వ్యూస్ వస్తాయి వెబ్ సైట్స్ కి. ఇదంతా చూసి ఆయనేదో గొప్పగా మాట్లాడినట్టు కాదు. ఆ మాటల్ని కామెడీగా చూస్తారు. ప్రతి మాటకు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకోవడం సహజమే.” అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు.

కేసీఆర్ తో కలిసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి లో ఒక కూటమి ని ఏర్పాటు చెయ్యాలని, ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటూ ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలనీ భావిస్తున్నారు ప్రకాష్ రాజ్, ప్రస్తుతం ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసే పనిలో కేసీఆర్ బిజీ బిజీ గా ఉన్నారు.

 

Comments

comments

Share this post

scroll to top