సెల్ఫీల మోజులో త‌ల్లిదండ్రులు…2వ అంత‌స్తు నుండి కింద ప‌డ్డ 10నెల‌ల పాప‌.!( Shocking Video)

సెల్ ఫోన్ ఉంటే చాలు ఇల్లు,గుడి ,బడి,రోడ్డు..ఇలా ఎక్కడ నిలబడితే అక్కడ సెల్ఫీ దిగడమే..పక్కన ఏం జరుగుతుంది..పక్కనుండి ఎవరెళ్తున్నారు ఏవి పట్టించుకోకుండా లోకాన్నే మర్చిపోతున్నారు.చిన్నాపెద్దా తేడాలేకుండా ఫోన్ మాయలో ,ఫోటోల మాయలో మునిగిపోతున్నారు..ఆ సెల్ఫీ పిచ్చే ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది.. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది..సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది..

రాజస్తాన్ లోని గంగా నగర్‌కు చెందిన భార్యాభర్తలు రాహుల్ వాల్మికి,మీరా దంపతులు తమ  కూతురికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ట్రీట్మెంట్ కి హాస్పటల్ కి తీసుకుని వచ్చారు.హాస్పటల్లో చెకప్ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న సీజీఆర్ షాపింగ్ మాల్లోకి వెళ్లారు.మాల్ మొత్తం తిరుగుతూ సరదాగా సెల్ఫీలు దిగుతున్నారు.ఇదే క్రమంలో మూడో అంతస్తుకి వెళ్లడానికి ఎస్కలేటర్ పైకి వెళ్తూ సెల్ఫీ దిగబోయారు..అంతే హఠాత్తుగా మీరా చేతిలో ఉన్న పదినెలల పసికందు చేతిలోనుండి జారిపోయింది..ఎస్కలేటర్ కు,ర్యాంప్ కు మధ్యలో ఉన్న ఖాళీ భాగంలో నుండి కింది ఫ్లోర్ లోకి జారిపడింది.అంత ఎత్తునుండి పడీపడడంతోనే చిన్నారి శరీరంమొత్తం ముక్కలై విపరీతమైన రక్తస్రావం జరిగింది..ఘటన జరిగిన వెంటనే హాస్పటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూసింది.లోకాన్ని చూడాల్సిన పసికందు తన తప్పేం లేకపోయినా తన ప్రాణాలని కోల్పోయింది. చిన్నారి కింద పడిపోతుండటంతో పక్కనే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.ఎస్కటేటర్ పైకి వెళ్లడానికి ముందు,ఎస్కలేటర్ పైకి వెళ్లాక వారు సెల్ఫీలు తీసుకోవడం ఆ వీడియోల్లో కనిపించింది.

గతంలో ఇదేవిధంగా ముంబైలో మరో ఘటన చోటుచేసుకుంది..ఎన్నో కలలు కనిపిల్లల్ని కంటాం వారిని పెంచే క్రమంలో మనం చేసే చిన్న నిర్లక్ష్యం ఫలితంగా  భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.. కాబట్టి పిల్లల్ని తీసుకుని బయటికి వచ్చేటప్పుడు కొంచం అప్రమత్తంగా ఉండాలి..

Watch Video:

https://www.youtube.com/watch?v=ahnQ8m17scU

Comments

comments

Share this post

scroll to top