కూతురు పెళ్లి కోసం కలిసిన ఒకప్పటి హీరోహీరోయిన్లు..! 2001 లో విడిపోయారు..కానీ ఇప్పుడు.?

అమృత…మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన అద్బుత చిత్రం..శ్రీలంక ఎల్టీఇ నేపధ్యంలో ఒక చిన్నారి కథగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.మణిరత్నం తీసిన గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఆ సినిమాలో అమృతగా నటించిన అమ్మాయి గుర్తుందా..తన నటనతో కట్టిపడేసిన అమృతగా నటించింది కీర్తన అనే అమ్మాయి..ఇప్పుడు ఆ చిన్నారి పెళ్లీడుకొచ్చింది..పెళ్లి కూడా జరిగింది..అయితే ఈ పెళ్లివేడుకలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే కీర్తన అమ్మానాన్న… ఎందుకో తెలుసా..?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సీత తర్వాత క్యారెక్టర్ నటిగా స్థిరపడిపోయింది.. నటుడు ,దర్శకుడు పార్తిబన్ ఇప్పటికి తనదైన సినిమాలు చేస్తున్నాడు.అమృత తల్లిదండ్రులు వీరిద్దరే..అవునండి సీత,పార్తిబన్ ల గారాలపట్టి..కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే సీత ,పార్తిబన్లు పెళ్లి చేసుకున్నారు.వీరికి ముగ్గురు పిల్లలు కలిగారు..వారిలో ఒకరే కీర్తన.. ఏమైందో ఏమో తెలియదు పదకొండేళ్ల వైవాహిక జీవితం తర్వాత సీత,పార్తిబన్ విడాకులు తీసుకున్నారు..గత కొన్నేళ్లుగా వీరు వేరుగానే ఉంటున్నారు.అయితే ఇటీవల వీరిద్దరూ కలిసి తమ కూతురు వివాహ వేడుకలో దంపతులుగా కనపడ్డారు.ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తనయుడు అక్షయ్ తో కీర్తన వివాహం జరిగింది. ఈ వేడుకకు తమిళ చిత్ర, రాజకీయరంగాల ప్రముఖులు హాజరయ్యారు.

భార్యభర్తలుగా విడిపోయినా తాము తల్లిదండ్రులుగా కలుస్తామని వీరు అందరికీ స్పష్టం చేస్తూ పెళ్లి బాధ్యతల్లో పాలుపంచుకున్నారు. వివాహానికి వచ్చిన అతిథులకు ఆహ్వానం పలుకుతూ.. తల్లిదండ్రులుగా తమ బాధ్యతను పూర్తి చేశారు. .పెళ్లికి హాజరైన అతిధులు కూడా వీరిద్దరిని ఈ విధంగా చూసి ఆశ్చర్యపోయారు..

Comments

comments

Share this post

scroll to top