బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముచ్చటగా మూడోసారి ఏంచేసాడో తెలుసా

babai babai

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముచ్చటగా మూడోసారి ఎం చేసాడో తెలుసా.. ఐతే మనం కొంచం కిందికి వచ్చి జాతీయ రాజకీయాలు తెలుసుకోవాల్సిందే . భారతీయ జనతాపార్టీ సమయాన్ని బట్టి వారి నిబంధనలను మారుస్తోంది. అదేంటంటే ముచ్చటగా మూడోసారి జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా ను ఎంపిక చేసుకోవడమే.బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముచ్చటగా మూడోసారి ఎం చేసాడో తెలుసా.. ఐతే మనం కొంచం కిందికి వచ్చి జాతీయ రాజకీయాలు తెలుసుకోవాల్సిందే .

భారతీయ జనతాపార్టీ సమయాన్ని బట్టి వారి నిబంధనలను మారుస్తోంది. అదేంటంటే ముచ్చటగా మూడోసారి జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా ను ఎంపిక చేసుకోవడమే. శనివారం ఢిల్లీలో ప్రారంబమైన బిజెపి జాతీయ కార్య వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2014లో పార్టీ పగ్గాలు స్వీకరించిన షా తిరిగి 2016లో సైతం పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. బిజెపి నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడిగా పనిచెయ్యవచ్చు. ఈ నిబంధన ప్రకారం షా కి 2019 జనవరి నాటికి పదవీకాలం పూర్తి అవుతుంది ఐతే 2019 లో కూడా అమిత్ షా నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ జాతీయ పదాధికార్లు రాష్ట్ర శాఖల అధ్యక్షులు పాల్గొన్న జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ లోని అందరు సర్వ శక్తులు వొడ్డాలని ,ప్రత్యేకంగా ముందస్తు ఎన్నికలకోసం వెళ్తున్న తెలంగాణ పై ద్రుష్టి పెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. పార్టీ నిబంధనలు తోసిరాజని అమిత్ షా పై బిజెపి మరోసారి పగ్గాలు అప్పగించింది మరి 2019 ఎన్నికలలో మోడీ షా జోడి ఫలితాలు ఎలా వుంటాయో వేచి చూద్దాం.

Comments

comments