ఆ రేషన్ షాపులో ప‌నిచేసే వ్య‌క్తి జ‌నాల‌ను ఎలా మోసం చేస్తున్నాడో చూడండి..! (Video)

కిరాణా షాపులు, రేషన్ షాపుల్లో మ‌నం కొనే కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను తూకం వేసి అమ్ముతారు కదా. అప్పుడు స‌ద‌రు వ్యాపారులు ఎలాంటి మోసాలు చేస్తారో అంద‌రికీ తెలిసిందే. తూకం వేసే పాత్ర కింద అయ‌స్కాంతం లేదా చింత‌పండు పెట్టి కొంత స‌రుకును నొక్కేస్తారు. అలా మోసం జ‌రుగుతుంది. దీని గురించి అంద‌రికీ తెలుసు. అయితే ఇలా మోసం చేస్తే అంద‌రికీ తెలుస్తుంది అనుకున్నాడో ఏమో గానీ… ఆ రేషన్ షాపులో ప‌ని చేసే ఓ వ్య‌క్తి త‌న‌దైన వెరైటీ స్టైల్‌లో మోసం చేయ‌డం ప్రారంభించాడు.

Watch Video:

చూశారుగా..! వీడియోలో ఆ వ్య‌క్తి చేస్తున్న మోసాన్ని. ఎల‌క్ట్రానిక్ కాంటా అది. దానిపై ఉండే పాత్ర‌కు త‌న వైపుగా ఓ బ‌రువు గ‌ల బాటును ఉంచి అనంత‌రం ఆ పాత్ర‌లో వినియోగ‌దారుల‌కు కావ‌ల్సిన‌వి జోకి ఇస్తున్నాడు. అయితే అలా జోకి ఇచ్చే క్ర‌మంలో చాలా తెలివిగా ఆ బాటును తీస్తున్నాడు చూడండి. ఎదురుగా ఉండే వారికి అస‌లు మోసం చేస్తున్న‌ట్టు క‌నిపించ‌దు. అంత తెలివిగా ఆ వ్య‌క్తి మోసానికి పాల్ప‌డుతున్నాడు.

నిజానికి ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లోది కాదు. త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఓ ప్రాంతంలో ఉన్న రేష‌న్ షాపులోనిది. అయితే ఆ వ్య‌క్తి అలా చేస్తున్న‌ప్పుడు ఎవ‌రో దాన్ని వీడియో తీశారు. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్‌లో వైర‌ల్ అవుతోంది. అయితే… ఎందుకైనా మంచిది, మీరు కూడా రేష‌న్ స‌రుకులు పొందుతుంటే ఇలా గ‌న‌క మోసం చేస్తున్నారేమో ఓ సారి చెక్ చేయండి. లేదంటే స‌రుకు న‌ష్ట‌పోతారు..!

Comments

comments

Share this post

scroll to top