కష్టపడందే ఏదీ మన దరికి రాదు. ఏ పనిలోనైనా కష్టం ఉంటేనే ఫలితం దక్కుతుంది. ఆయాచితంగా వచ్చే ఏదీ నిలవదు. అయితే ఇది కేవలం ధనం, ఆస్తి విషయంలోనే కాదు, చదువుకూ వర్తిస్తుంది. ఎందుకంటే కష్టపడి చదివితేనే కదా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. అదే కష్టపడకుండా కాపీ కొట్టి పాసైతే ఇంక దానికి అర్థం ఏముంటుంది. అలా వచ్చిన విద్యార్హతలతో ఎలా రాణించగలుగుతారు? రాణించలేరు. కాబట్టి కాపీ కొట్టకుండా నిజాయితీగా పరీక్ష రాయండి. ఫలితం కోసం ఎదురు చూడండి. అవునూ, అసలిదంతా ఎందుకు చెబుతున్నారనే కదా ఇప్పుడు మీరు అడగబోయేది. అక్కడికే వస్తున్నాం.
ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ సాంకేతిక పరంగా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒకప్పటి పాత తరహా విధానాలను ఎవరూ పాటించడం లేదు. కొత్తవి మరింత అనువుగా ఉండడంతో వాటి పట్లే అందరూ మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో కాపీ కొట్టాలనుకునే విద్యార్థులు కూడా కొత్త తరహా పద్ధతులను పాటిస్తున్నారు. వాటి గురించే ఇప్పుడు మేం చెప్పబోయేది. నేటి ఆధునిక ప్రపంచంలో పలువురు విద్యార్థులు పరీక్షలు పాస్ అవడం కోసం ఏవిధంగా కాపీ కొడుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఆయా కాపీ విధానాలకు సంబంధించిన ఇమేజ్‌లను కింద చూడవచ్చు.
చేతికి అంటించుకున్న మెడికల్ బ్యాండ్ ద్వారా కాపీయింగ్
వాటర్ బాటిల్‌కు అతికించిన రేపర్ లోపలి వైపు చూడండి
అబ్బా… కాపీయింగ్ ఇలా కూడానా…
చేతి వేలి గోర్లపై కాపీ టెక్ట్స్
అది వాచ్ కాదు… చిట్టీ పేపర్…
చెప్పుల్లో చదువులా..?
బూట్లపై పీరియాడిక్ టేబుల్
చ్యూయింగ్ గమ్‌పై మ్యాథమాటిక్స్ ఫార్ములా
అబ్బా… అక్కడ కూడానా…