మీ అరచేతి గీతల్లో…M అనే ఇంగ్లీష్ అక్షరం ఉందా…? అయితే ఓ సారి టెస్ట్ చేసుకోండి.

మన జీవితం భవిష్యత్ లో ఎలా ఉండబోతుందో, ఏం మంచి జరగబోతుందో.. తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ కుతూహలంగా ఉంటుంది. అందుకే జాతకాలను ఎక్కువగా నమ్ముతుంటారు మనవాళ్ళు. మంచి జరిగినా చెడు జరిగినా సరే తెలుసుకోవాలన్న ఆశతో మన విధిరాత ఎలా ఉందో అని మన పూర్వీకుల కాలం నుండి జాతకాలను నమ్ముతున్నారు. ఇప్పటివరకూ చేతి రేఖల ద్వారా మన భవిష్యత్ ను తెలుసుకున్న మీకు ఇప్పుడు మరో శుభవార్తను, మరో సరికొత్త జాతక విధానాన్ని మీరు తెలుసుకోబుతున్నారు.

మీ  అరచేతి రేఖలో ఇంగ్లీష్ అక్షరం ‘M’ ఉంటే  మీరు ఎంత ప్రత్యేకమో, మీ భవిష్యత్, మీ వ్యక్తిత్వం ఎలా ఉండబోతుందంటే.. అరచేతిలో ‘M’ లెటర్ ముఖ్యంగా మూడు విషయాలను తెలుపుతుంది. హృదయం, తల మరియు మీ జీవితాలను ఇది సూచిస్తుంది. ఈ అక్షరం ఉండేలా మీ అరచేతిలో రేఖలు ఉంటే వ్యక్తిత్వంగా చాలా మంచి స్వభావం కలవారు, ఇతరులకు హాని చేసే గుణం లేదని, చెడువాళ్ళు కాదని అర్థం. ఈ అక్షరం రేఖలు కలవారు సొంత నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.వాళ్ళు వెళ్ళే దారిలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే చివరికి విజయం సాధిస్తారని ‘కిరొమన్సీ’ జాతకం తెలుపుతుంది. ఎలాంటి పరిస్థుతుల్లో అయినా సరే మీ ధైర్యాన్ని కోల్పోరు. అయితే మహిళల చేతిలో మాత్రం కొన్నిసార్లు దెబ్బతినే అవకాశం ఉంది.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top