ఫేస్ బుక్ లో సీక్రెట్ చాటింగ్… ఎలానో తెలుసుకోండి.?

ఎప్పుడైతే ఫేస్ బుక్, వాట్సప్ మెసెంజర్లు వచ్చాయో అప్పటి నుంచి లెటర్లు, ఎస్సెమ్మెస్ లు పంపడం ఆగిపోయాయి. అయితే మధ్యలో కొంత కాలం వాట్సప్ చాటింగ్ హ్యక్ చేయొచ్చు, ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ వేరే వాళ్లు చదివే అవకాశం ఉందని వార్తలు రావడంతో… వాట్సప్ దానిపై చర్యలు చేపట్టింది. ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ని ఏర్పాటు చేసింది. దీంతో చాటింగ్ చేసుకునే ఇద్దరు తప్ప ఆ మెసేజ్ లు ఎవరు చదవలేరు.


ఇప్పుడు ఇలాంటి వెసులుబాటునే ఫేస్ బుక్ మెసెంజర్ లో కూడా వచ్చింది. ఎవరితోనైనా రహస్యంగా చాట్ చేసుకోవచ్చు. ఆ మెసేజ్ లు ఎక్కువ సేపు ఉండవు. దీన్నే సీక్రెట్ కాన్వర్జేషన్ అంటారు. మరి ఫేస్ బుక్ లో సీక్రెట్ చాటింగ్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి.


ముందుగా మెసెంజర్ ఓపెన్ చేసి ఎవరితో అయితే రహస్యంగా చాట్ చెయ్యాలనుకుంటున్నారో వారి పేరుపై క్లిక్ చేసి చాట్ విండో ఓపెన్ చెయ్యాలి. ఆ చాట్ విండో టాప్ రైట్ కార్నర్ లోని ఇన్ఫో ఐకాన్ పై క్లిక్ చేసి ‘Go to Secret Conversation’ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత సీక్రెట్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి. టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు సెట్ చేసిన టైమ్‌ని బట్టి మెసేజెస్ డిలిట్ అవుతాయి.

Comments

comments

Share this post

scroll to top