అనంత్ అంబానీ బరువు తగ్గడం వెనుక ఉన్న అసలు రహస్యం..!

అధిక బరువు… ఊబకాయం… ఎలా పిలిచినా నేడు ఈ సమస్య అధికమైంది. ఉండాల్సిన బరువు కన్నా ఎంత ఎక్కువున్నా దాని వల్ల మనకు అనారోగ్య సమస్యలు తప్పవు. మరీ ఒక మోస్తరు అధిక బరువు ఉన్నవారి కంటే భారీకాయం ఉన్నవారికైతే ఎప్పుడు దాడి చేద్దామా అన్నట్టుగా అనారోగ్యాలు పొంచి ఉంటాయి. అలాంటి వారిలో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ కూడా ఒకరు. విపరీతమైన ఊబకాయంతో బాధపడుతున్న ఇతను ఇప్పడు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాడు. అందుకు కారణమేమిటంటే అతని బరువే. అతని ఒకప్పటి రూపాన్ని, ఇప్పటి ఆకృతిని చూసి ప్రతి విస్మయానికి లోనవుతున్నారు. కేవలం 18 నెలల్లోనే 108 కిలోల బరువు తగ్గి అందరి చేత భేష్ అనిపించుకుంటున్నాడు. ఇంతకీ అతను ఇంత త్వరగా బరువు తగ్గడానికి కారణమేంటి? తెలుసుకుందాం రండి..!

anant-ambani-3

అమెరికాకు చెందిన నిపుణులైన ట్రైనర్స్ సహాయంతో అనంత్ అంబానీ 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గాడు. అంటే నెలకు దాదాపుగా 6 కిలోల బరువు తగ్గాడన్నమాట. అయితే బరువు తగ్గేందు కోసం ముందుగా అనంత్ రోజూ దాదాపు 21 కిలోమీటర్ల పాటు వాకింగ్ చేశాడట. జామ్‌నగర్‌లోని రిలయన్స్ కంపెనీకి చెందిన రిఫైనరీలో ఉన్న తోటలో అతను రోజూ వాకింగ్‌కు వెళ్లేవాడట.

వాకింగ్ చేస్తూ మధ్య మధ్యలో యోగా, హై ఇంటెన్సిటీ కార్డియో వర్కవుట్ (గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తడం), వెయిట్ ట్రెయినింగ్ వంటివి చేసే వాడు. ఇదంతా చేసేందుకు అనంత్‌కు రోజూ దాదాపు 5, 6 గంటల సమయం పట్టేది.

బరువు తగ్గడం కోసం అనంత్ చక్కెరను పూర్తిగా మానేశాడు. కాకపోతే షుగర్ ఫ్రీ చక్కెరను ఉపయోగించేవాడు. దీనికి తోడు ఆహారంలోనూ అతను సమూల మార్పులు చేసుకున్నాడు. కార్బొహైడ్రేట్స్ తక్కువగా, ప్రోటీన్స్ ఎక్కువగా, ఫ్యాట్స్ మితంగా ఉన్న ఆహారం తీసుకునే వాడు.

ఆరంభంలో దాదాపు 3 నెలల పాటు అతను అంతగా బరువు తగ్గలేదు. కానీ ఆ తరువాత అతని దేహంలో ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చాయి. రోజూ కచ్చితమైన నియమాలను పాటిస్తుండడంతో అతని శరీరం నుంచి కొవ్వు కరగడం ప్రారంభమైంది.

అనంత్ అంబానీకి దైవభక్తి చాలా ఎక్కువట. ఈ క్రమంలో తాను బరువు తగ్గాలని తనకెంతో ఇష్టమైన తిరుపతి వెంకన్నను, సోమనాథున్ని వేడుకున్నాడట. ఆశ్చర్యంగా అతని ప్రార్థన ఫలించి బరువు తగ్గాడు.

anant-ambani-2

అయితే చాలా మంది మాత్రం దీన్ని ఇంకా నమ్మడం లేదు. లైపోసక్షన్ లాంటి ఆపరేషన్ చేయించుకుని అనంత్ బరువు తగ్గాడని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కాగా అనంత్ తల్లి నీతా అంబానీ కూడా తన కుమారుడు బరువు తగ్గడం కోసం ప్రోత్సాహం అందించిందట. ఇప్పుడు అతని బరువు చూసి ఆమె తనను తానే నమ్మలేకపోతుందట.

ఆస్తమాను నియంత్రించేందుకు వివిధ రకాల మందులను వాడడంతో అతనికి ఆకలి పెరిగిందని, ఈ క్రమంలోనే తన తిండిని అనంత్ కంట్రోల్ చేసుకోలేకపోయాడని, అందుకే అంతగా బరువు పెరిగాడని తెలిసింది. అయితే ఇప్పుడు అనంత్ ఒకే సారి దాదాపు 100 కిలోలకు పైగా బరువు తగ్గడంతో ఇప్పుడు దృష్టంతా అతని వెయిట్ లాస్ సీక్రెట్‌పై పడింది.

anant-ambani-1

బరువు తగ్గడం ఏమోకానీ క్రికెటర్లు మొదలుకొని సెలబ్రిటీలందరూ అనంత్‌తో ఫొటోలు దిగుతూ, ట్వీట్ల ద్వారా అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ముంబై ఇండియన్స్ టీం ఆడే మ్యాచ్‌ల వద్ద ఎక్కువగా కనిపించిన ఒకప్పటి ‘ఊబకాయ’ అనంత్ ఇప్పుడు సన్నబడి స్లిమ్‌గా కనిపిస్తుండడంతో అతని ఆకృతిని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా బరువు తగ్గడాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని అంతటి ఊబకాయం తగ్గించుకున్నాడంటే నిజంగా అనంత్‌కు మనం అభినందన తెలపాల్సిందే!

Comments

comments

Share this post

scroll to top