19,990 రూపాయలకే స్కూటీ…

ఎలక్ట్రానిక్ స్కూటర్..పేరు సుపరిచితమే అయినా…వాడుకలో ఉన్నది చాలా తక్కువే..ఇప్పుడు ప్రముఖ టూవీలర్ సంస్థ హీరో గ్రూప్ ఆ మార్గాన్ని సుగమం చేసింది. ఇండియాలో వాహనదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు, అతి తక్కువ ధరకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంలోకి రానుంది. ఇంతకీ ఈ  హీరో ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంతో తెలుసా 19,990 రూపాయలు.

సుదూర ప్రాంతాలు వెళ్లాలంటే కష్టమే కానీ దగ్గరదగ్గర తిరగాలంటే ఈ స్కూటర్ ఉత్తమమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 48-వోల్ట్ 20ఏహెచ్ వీఆర్ఎల్ఏ బ్యాటరీ సామర్థ్యంతో రూపొందించిన ఈ స్కూటర్ను ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు 65 కిలోమీటర్లు తిరగొచ్చట. ఈ స్కూటర్ గరిష్ట వేగం 25 కిలోమీటర్లు. ఇక దీని  బరువు కేవలం 87 కిలోలు. మెగ్నీషియం ఎల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఈ స్కూటర్ ప్రత్యేకత.

Comments

comments

Share this post

scroll to top