స్కూటీ మీద వేగంగా వెళ్తున్న అమ్మాయి…సడెన్ గా ఆగింది.! ఆమె చెప్పిన కారణం కి నవ్వాపుకోలేరు!

ఓ అర్జెంట్ పనిమీద సెక్రెటేరియట్ కు వెళ్తున్నాను. దిల్ సుఖ్ నగర్ నుండి బైక్ మీద స్టార్ట్ అయ్యాను. టైమ్ 9.30 అవుతుంది. ఆఫీసులకు వెళ్ళే వాళ్లతో రోడ్ అంతా రద్దీగా ఉంది. హైద్రాబాద్ సిగ్నల్స్ షరామామూలే… స్ల్పెండర్ మీద 60 స్పీడ్ లో ఓ సైడ్ నుండి వెళుతున్న నన్ను.. స్కూటీ మీద వెళుతున్న ఓ అమ్మాయి క్రాస్ చేసింది . యమ జోష్ తో… వయస్సు 20 లోపే అనిపించింది. హర్రీబర్రీగా నడుపుతుంది తన స్కూటీని…అంత అర్జెంట్ ఏంటో అనుకున్న మనసులో…… నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ఓ సిగ్నల్ ను కూడా జంప్ చేసి, రయ్ అంటూ దూసుకుపోతుంది.

 

ఆమె సిగ్నల్ జంప్ చేసిన 5 సెకండ్లకే గ్రీన్ సిగ్నల్ పడడంతో నేను కదిలాను. ఇంతలోనే….. ఆ అమ్మాయి మలక్ పేట్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర తన స్కూటీని ఆన్ లోనే ఉంచి నిల్చుంది. వేగంగా వచ్చిన చాలా మంది ఆమె వెనుకాలే సడెన్ బ్రేక్ వేస్తూ ఆగిపోయారు…. అంతా అయోమయంగా ఉంది. ఏంటా అని సందుల్లోంచి సందుల్లోంచి కార్లను తప్పించుకుంటూ నేను నా బైక్ మీద ఆ అమ్మాయి దగ్గరికెళ్లా..! అందరూ ఆమెనే అడుగుతున్నారు… ? ఎందుకు ఆగారు? ఏమయ్యింది. సిగ్నల్ కూడా లేదు కదా అని.!

దానికి ఆమె చెప్పిన సమాధానం….పైన రైలు వెళుతుంది. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ ను దాటుకుంటూ వెళ్లాలి. ఆ టైమ్ లో ట్రైన్ నుండి వన్..టూ లాంటివి మీద పడితే…ఛీ..ఛీ మళ్లీ నేను ఇంటికెళ్లి రెడీ అయి ఆఫీస్ కు వెళ్లాలి…సో రిస్క్ అంటూ సెలవిచ్చింది ఆ మేడమ్….ఇంతలో పక్కకున్న ఓ 50 ఏళ్ల పెద్ద మనిషి…. నీ మొహం మండ…పైన వెళ్లేది లోకల్ ట్రైనే.! అంటూ గేర్ మార్చుకొని వెళ్లిపోయాడు. ఆమె పక్కకున్నోళ్లంతా పగలబడి నవ్వుకున్నారు. నాతో సహా. 🙂

( లోకల్ ట్రైన్ లో టాయిలెట్స్ ఉండవు)

Comments

comments

Share this post

scroll to top