ల్యాబొరేట‌రీలో ఆ సైంటిస్టులు ఏకంగా గుండెనే త‌యారు చేసేశారు..!

మ‌నిషికి గుండె ఎంత ప్ర‌ధాన అవ‌య‌వ‌మో అంద‌రికీ తెలిసిందే. గుండె లేక‌పోతే మ‌నిషి లేడు. అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్న క్ర‌మంలో వారికి స‌రైన చికిత్స చేయ‌డం కఠినంగా మారుతోంది. ఈ క్ర‌మంలో వారిలో కొంద‌రికి గుండెను మార్పిడి చేయాల్సి వ‌స్తోంది. అయినా వారు బ‌తుకుతార‌న్న గ్యారెంటీ లేదు. అయితే అలాంటి వారి కోస‌మే కాదు, గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి కూడా సైంటిస్టులు ఓ తీపి క‌బురు చెబుతున్నారు. అదేమిటో మీరే చ‌దివి తెలుసుకోండి..!

artificial-human-heart

మ‌సాచుసెట్స్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌, హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్‌ల‌కు చెందిన సైంటిస్టులు గుండెన కృత్రిమంగా త‌యారు చేశారు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. అందుకోసం వారు స్టెమ్ సెల్స్‌ను ఎంచుకున్నారు. ముందుగా ఓ వ్య‌క్తికి చెందిన చ‌ర్మంలోని కొన్ని స్టెమ్ సెల్స్‌ను ప్ర‌త్యేక‌మైన ప‌ద్ధ‌తిలో వేరు చేసి వాటిలో వారి గుండెకు చెందిన కొన్ని క‌ణాల‌ను ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో ఆ క‌ణాల‌కు ప్ర‌తి 2 వారాల‌కు ఒక సారి పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని ద్ర‌వం రూపంలో ఇచ్చారు కూడా.

అయితే స‌ద‌రు క‌ణాలు గుండెలా త‌యారు కావ‌డం మొద‌లు పెట్టి కొద్ది రోజుల‌కు దాని రూపంలోకి మారాయి. దీంతో ఆ సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న విజ‌య‌వంతం అయింది. అలా వారు ల్యాబ్‌లో ఏకంగా ఓ గుండెనే త‌యారు చేసేశారు. అయితే ఆ గుండె కొట్టుకోవ‌డం కోసం సైంటిస్టులు దానికి ఎల‌క్ట్రిక్ షాక్‌లు కూడా ఇచ్చారు. కానీ… అందుకు అనుగుణంగా ఫ‌లితం రాలేదు. అయితే దానికి మ‌రిన్ని మార్పులు చేసి త్వ‌ర‌లోనే గుండెను త‌యారు చేసి చూపిస్తామ‌ని వారు అంటున్నారు. ఇది గ‌న‌క స‌ఫలీకృతం అయితే ఎంచ‌క్కా ఎవ‌రైనా త‌మ చ‌ర్మ క‌ణాలు, హృద‌య క‌ణాల‌తో ఓ గుండెను త‌యారు చేయించుకుని పాడైన దాని స్థానంలో కొత్త గుండెను అమ‌ర్చుకోవ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top