పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు యూనిఫాంలో రావొద్దు.!?

తెలంగాణ లో ఈ నెల 21 నుండి జరగనున్న పదవతరగతి పరీక్షలకు సంబంధించి తెలంగాణ SSC బోర్డ్ కొన్ని సరికొత్త నిబంధనలను విధించింది. ఈ సారి పదవ తరగతి పరీక్షకు హజరయ్యే విధ్యార్థులు స్కూల్ యూనిఫాం లో కాకుండా సాధారణ దుస్తువులను ధరించే రావాలని తెలియజేసింది. మునుపెన్నడూ కూడా ఇటువంటి నిబంధనను తెరమీదకు తేలేదు.. ఫస్ట్ టైమ్ ఈ సరికొత్త నిబంధనను అమలు చేయనుంది తెలంగాణ ssc బోర్డ్ …..అలా ఎందుకు ???అంటే….డ్రెస్ ను బట్టి వారు ఏ స్కూల్ పిల్లలో గుర్తుపట్టి వారికి ఎవరైనా పరీక్షా హాల్ లో ప్రత్యేక సహాయసహాకారాలు అందిస్తారేమోననే అనుమానంతోనే ఈ సరికొత్త నిబంధన ప్రవేశ పెట్టారు అని పరీక్ష నిర్వాహకులు ఆప్ ద రికార్డ్ చెబుతున్న మాటలు.

1454150860

దీనితో పాటు మరో కొత్త నిబంధనను కూడా ఈ సారి నుండి అమలు చేయనున్నారు. పరీక్ష హాల్ లోకి స్టూడెంట్ , ఇన్విజిలేటర్ చివరికి చీఫ్ సూపరిడెంట్ కూడా ఫోన్లు వాడడం నిషేదం… చీఫ్ సూపరిడెంట్ కు మాత్రం కాస్త మినహాయింపునిచ్చారు. సెల్ వాడొచ్చు కానీ వాట్సాప్ లేని సెల్ ఫోన్ నే వాడాలని నిబంధన….ఎందుకంటే వాట్సాప్ ద్వారా పరీక్షా పత్రాలను బయటికి పంపుతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ జాగ్రత్త తీసుకున్నారని తెలిసింది.

Comments

comments

Share this post

scroll to top