హ‌వ్వ‌… చెప్పుకుంటే సిగ్గు చేటు… ప్ర‌భుత్వ స్కూల్‌ను క్యాబ‌రే ప‌బ్‌, బార్‌గా మార్చారు కొంద‌రు దౌర్భాగ్యులు..!

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నేడు విద్యార్థుల‌కు ఎలాంటి స‌దుపాయాలు అందుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. త‌ర‌గతి గ‌దులు, తాగునీరు, మ‌రుగుదొడ్లు, మ‌ధ్యాహ్న భోజ‌నం, ఉపాధ్యాయుల కొర‌త వంటి స‌మస్య‌లు విద్యార్థుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. అయితే ఈ స‌మ‌స్యలు ఎప్ప‌టి నుంచో ఉన్న‌వే క‌దా, మ‌ళ్లీ వాటిని చెప్ప‌డం ఎందుకు..? అంటారా..? అవును, ఇవి నిజానికి పాత స‌మ‌స్య‌లే. కానీ ఇప్పుడు కొత్త త‌ర‌హా స‌మస్య‌లు వ‌స్తున్నాయి. అదెలాగంటే.. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మిర్జాపూర్ అనే గ్రామంలో ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను కొంద‌రు స్థానికులు ఏకంగా బార్ లా మార్చారు. యువ‌తుల‌తో క్యాబ‌రే డ్యాన్సులు చేయించారు.

ఉత్త‌రప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న చాలా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ నెల 7వ తేదీన ర‌క్షాబంధ‌న్ కార‌ణంగా పాఠ‌శాల‌కు సెల‌వు ఇచ్చారు. అయితే మ‌రుస‌టి రోజు వ‌చ్చి చూసే స‌రికి విద్యార్థులు, ఉపాధ్యాయులకు పాఠ‌శాల ప్రాంగ‌ణం చెత్త‌, వ్య‌ర్థాల‌తో నిండి క‌నిపించింది. ఎక్క‌డ చూసినా చెత్త పేరుకుపోయి ఉంది. దీంతో విషయం గురించి అసిస్టెంట్ టీచ‌ర్ అశోక్ కుమార్ ఆరా తీయ‌గా స్థానికులు చెప్పారు. ముందు రోజు.. అంటే ఆగస్టు 7వ తేదీన రాత్రి స్థానికంగా ఉండే రాంకేష్ యాద‌వ్ అనే ఓ బ‌డాబాబు కుటుంబ స‌భ్యులు, బంధువులు ఆ స్కూల్‌లో పార్టీ చేసుకున్నార‌ట‌. మద్యం, మాంసం సేవించి, యువ‌తుల‌తో అర్థ‌న‌గ్న డ్యాన్సులు చేయించార‌ని స్థానికులు చెప్పారు. దీంతో టీచ‌ర్ అశోక్ కుమార్ విద్యాశాఖ అధికారి ప్ర‌వీణ్ కుమార్ తివారీకి ఫిర్యాదు చేయ‌గా ఆయన సంఘ‌ట‌న‌పై విచారించి వివ‌రాలు ఇవ్వాల‌ని, బాధ్యుల‌పై కేసులు పెట్టాల‌ని బ్లాక్ ఎడ్యుకేష‌న్ ఆఫీస‌ర్ (బీఈవో)కు ఆదేశించారు.

అయితే ఆ పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు ఈ విష‌యంపై ఏం చెబుతున్నాడంటే.. తన‌ను రాంకేష్ యాద‌వ్ స్కూల్ తాళాలు అడిగాడ‌ని, వాటిని అత‌నికి ఇచ్చాన‌ని, కానీ స్కూల్‌లో పార్టీ నిర్వ‌హిస్తున్న‌ట్టు త‌న‌కు అత‌ను చెప్ప‌లేద‌ని అన్నాడు. అయినా పార్టీ నిర్వ‌హించినా, లేక‌పోయినా స్కూల్ తాళాలు ఇత‌ర వ్య‌క్తుల‌కు ఎలా ఇస్తారో ఆ ప్ర‌ధానోపాధ్యాయులకే తెలియాలి. ఇక స‌ద‌రు నిందితుడు రాంకేష్ యాద‌వ్ ఏమంటున్నాడంటే… పార్టీ కోసం తాళాలు తీసుకున్న మాట వాస్త‌వ‌మేన‌ని, అయితే ఆ పార్టీకి తాను వెళ్లలేద‌ని అంటున్నాడు. అయినా పార్టీకి వెళ్లినా, వెళ్ల‌క‌పోయినా, అందుకోసం తాళాలు ఎలా తీసుకుంటారు, అదేమైనా అత‌ని సొంత ప్రాప‌ర్టీయా ? అంటే అందుకు రాంకేష్ యాద‌వ్ స‌మాధానం చెప్ప‌డం లేదు. ఏది ఏమైనా ఇలాంటి సిగ్గుమాలిన చ‌ర్య‌లు చేసే వారిని అస్స‌లు విడిచిపెట్ట‌కూడ‌దు. స్కూళ్లంటే దేవాల‌యాల‌తో స‌మానం. అలాంటి ప‌విత్ర‌మైన చోట‌, అలా పార్టీలు చేస్తారా ఎవ‌రైనా..? వారిని మాత్రం క‌ఠినంగా శిక్షించాల్సిందే. అయితే ఈ ఘ‌ట‌న‌కు చెందిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో లీక‌వ‌డంతో ఇప్పుడీ సంఘ‌ట‌న వైర‌ల్ అయింది. మ‌రి సంబంధిత అధికారులు ఏం చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top