మైనర్ బాలికలపై టీచర్ల అత్యాచారం…ప్రెగ్నెంట్ అయిన ముగ్గురు విద్యార్థినులు.

అది మ‌హారాష్ట్ర‌లోని జ‌ల్‌గావ్ జిల్లా హ‌ల్ ఖేదా గ్రామం. అక్క‌డి ద‌గ్గ‌ర్లోనే బుల్దానా అనే జిల్లాలో ఉన్న నిన‌ది ఆశ్ర‌న్ అనే ఓ ప్రైవేటు రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లో హ‌ల్‌ఖేదా గ్రామానికి చెందిన 12 మంది ద‌ళిత‌  మైన‌ర్ బాలిక‌లు విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. వారందరూ 12 నుంచి 14 ఏళ్ల లోపు వారే. అయితే అందులో ముగ్గురు బాలిక‌లు ఇటీవ‌ల దీపావ‌ళికి ఇంటికి వ‌చ్చారు. కానీ వారు ఎప్ప‌టిలా ఇతర పిల్ల‌లతో క‌లిసి బ‌య‌టికి వ‌చ్చి ఆడుకోలేదు. ఇంట్లోనే ఓ మూల‌న ముభావంగా కూర్చునేవారు. ఉన్న‌ట్టుండి క‌డుపు నొప్పితో మెలిక‌లు తిరిగిపోయే వారు. దీంతో వారి వారి త‌ల్లిదండ్రులు ఆ బాలిక‌ల‌ను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌గా అక్క‌డ ఓ ప‌చ్చి నిజం బ‌య‌ట ప‌డింది. అదేమిటంటే… ఆ బాలిక‌లు అప్ప‌టికే 3 నెల‌ల గ‌ర్భ‌వ‌తులు అని తేలింది. దీంతో ఆ బాలిక‌ల త‌ల్లిదండ్రుల‌కు దిమ్మ తిరిగి పోయింది. ఒక్క‌సారిగా వారు తీవ్ర‌మైన షాక్‌కు, దిగ్భ్రాంతికి లోన‌య్యారు. ఒక్క నిమిషం ఏం చేయాలో తెలియ‌లేదు. వెంట‌నే తేరుకుని పోలీసుల‌కు కంప్లెయింట్ ఇచ్చారు.
minor-tribal-girls-rape
అస‌లు జ‌రిగిన విష‌యం ఏమిటంటే… స‌ద‌రు నిన‌ది ఆశ్ర‌న్‌లో పెద్ద సంఖ్య‌లో బాలిక‌లు విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. వారికి త‌గిన‌ట్టుగా ఉపాధ్యాయులు కూడా ఉండే వారు. వారిలో ఎక్కువ మంది పురుషులే. అయితే అందులో కొంద‌రు ఉపాధ్యాయులతోపాటు ఆ స్కూల్ హెడ్ మాస్ట‌ర్ కూడా సద‌రు హ‌ల్ ఖేదా గ్రామానికి చెందిన 12 మంది మైన‌ర్ బాలిక‌ల‌ను గ‌త కొన్ని నెల‌లుగా అత్యాచారం చేస్తూ వ‌స్తున్నారు. అయితే ఆ బాలిక‌లు మాత్రం అదేమీ తెలియ‌దు. త‌మ‌కు ఏం జ‌రుగుతుందో కూడా స‌రిగ్గా తెలుసుకోలేని స్థితిలో వారున్నారు. ఈ క్ర‌మంలో ఆ 12 మంది బాలిక‌ల్లో ముగ్గురికి గ‌ర్భం వ‌చ్చింది. దీంతో వారిని ఇంటికి పంపారు. ఆ త‌రువాత జ‌రిగింది తెలుసుగా..!

త‌మ పిల్ల‌ల‌కు అలా జ‌రిగింది అని తెలియ‌గానే బాధిత త‌ల్లిదండ్రులు ప‌రుగు ప‌రుగున వెళ్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వెంట‌నే వారు స్కూల్‌కు వెళ్లి విచార‌ణ చేప‌ట్టి మొత్తం ఉపాధ్యాయుల్లో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో నిందితులుగా అనుమానిస్తున్న 7 మందిని అరెస్టు చేశారు. అనంత‌రం ద‌ర్యాప్తు ప్రారంభించారు. అయితే, స‌ద‌రు నిందితులు కేవ‌లం 12 మంది బాలిక‌లే కాదు, ఇంకా ఎక్కువ మందినే రేప్ చేసిన‌ట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధ్రువీక‌రించ‌లేదు. కానీ త్వ‌ర‌లోనే ఆ సంఖ్య కూడా బ‌య‌ట‌కు తెలియ‌నుంది.

చూశారుగా… చదువు కోస‌మ‌ని బాలిక‌ల‌ను స్కూల్‌కు పంపితే ఎంత‌టి దారుణం జ‌రిగిందో. దీన్ని గురించి తెలుసుకున్నాక చాలా మంది బాలిక‌ల త‌ల్లిదండ్రుల‌కు ఒంట్లో ద‌డ‌గానే ఉంటుంది. కానీ ఏం చేస్తాం… మ‌న చ‌ట్టాలు అంత స్ట్రాంగ్‌గా లేవు క‌దా… అవి క‌ఠినాతి క‌ఠినం అయ్యే వ‌ర‌కు పైన చెప్పిన లాంటి దుష్టుల‌, కాముకుల చ‌ర్య‌లు కొన‌సాగుతూనే ఉంటాయి. మరి ఇలాంటి వారిని ఏం చేస్తే బాగుంటుందో… మీరైనా అభిప్రాయం తెలియ‌జేయండి..!

Comments

comments

Share this post

scroll to top