దారుణం.. స్కూల్ ఫీజు కట్ట‌డం లేద‌ని బాలికకు శిక్ష వేశారు. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

నీచం.. దారుణం.. అరాచ‌కం.. ఇలాంటి ప‌దాలన్నీ కూడా త‌క్కువే ఆ స్కూల్ యాజ‌మాన్యం గురించి చెప్ప‌డానికి. అంత‌లా వారు దిగ‌జారారు. సాధార‌ణంగా విద్యార్థులు స్కూల్ ఫీజు క‌ట్ట‌క‌పోతే ఏ స్కూల్ అయినా ఏం చేయాలి ? త‌ల్లిదండ్రులను పిలిపించి చెప్పాలి. లేదా పిల్ల‌ల‌తో స‌మాచారాన్ని త‌ల్లిదండ్రుల‌కు చేర‌వేయాలి. త‌ల్లిదండ్రులు అయిన‌ప్ప‌టికీ పిల్ల‌ల స్కూల్ ఫీజు క‌ట్ట‌క‌పోతే వారితోనే ఆ విష‌యం తేల్చుకోవాలి. అంతేకానీ అభం శుభం తెలియ‌ని చిన్నారుల‌ను ఆ ఉచ్చులోకి ఎందుకు లాగుతారు. అలా లాగే స్కూళ్ల‌ను ఏం చేయాలి ? ఆ ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్ యాజ‌మాన్యం కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. స్కూల్ ఫీజు క‌ట్ట‌లేద‌ని ఓ చిన్నారికి ప‌నిష్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఆ అవ‌మాన భారం త‌ట్టుకోలేక ఆ చిన్నారి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

అది ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఉన్న గోర్నియా గాంధీ న‌గ‌ర్ ప్రాంతం. అక్క‌డ పిలిభిత్ హజారా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న అమ‌న్ చిల్డ్ర‌న్స్ స్కూల్‌లో ఓ బాలిక 9వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. అయితే ఆమెకు సంబంధించిన రూ.1020 స్కూల్ ఫీజు పెండింగ్‌లో ఉంది. దీంతో స్కూల్ యాజ‌మాన్యం ఆ ఫీజును వ‌సూలు చేసేందుకు రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించింది. ఆ బాలిక‌ను త‌ర‌గ‌తి గ‌దిలో బెంచీపై ఒంటికాలిపై నిల‌బెట్టారు. కాలు తీస్తే మ‌ళ్లీ గంట పాటు ఆమెను నిల‌బెట్టేవారు. అలా రోజూ పాపం ఆ బాలిక‌కు శిక్ష వేసేవారు.

అయితే ఆ బాలిక త‌ల్లి ఓ పేద‌రాలు. ఆమెకు భ‌ర్త లేడు. ఉన్న ఒక్క‌గానొక్క కూతుర్ని ఆమె క‌ష్ట‌ప‌డి చ‌దివిస్తోంది. ఆ విష‌యం తెలిసి కూడా స్కూల్ యాజ‌మాన్యం అమానుషంగా అలా ఆ బాలిక‌కు శిక్ష వేసింది. దీంతో రోజూ ఆ అవ‌మాన భారాన్ని భ‌రించ‌లేని ఆ బాలిక ఓ రోజు స్కూల్ నుంచి ఇంటికి వ‌స్తూ దారిలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ క్ర‌మంలో స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఏది ఏమైనా ఇలాంటి స్కూల్స్ యాజ‌మాన్యాల‌ను మాత్రం అస్స‌లు విడిచిపెట్ట‌కూడ‌దు. క‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే.

https://daily.bhaskar.com/news/TOP-HDLN-VART-girl-commits-suicide-5804176-PHO.html?ref=hf

Comments

comments

Share this post

scroll to top