పాఠశాల టాయిలెట్ లో ప్రసవించిన 9 వ తరగతి బాలిక.!

9వ తరగతి చదివే ఓ బాలిక తాను చదివే పాఠశాలలో ఆడబిడ్డను ప్రసవించింది. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం..ఇది జరిగింది కూడా హైద్రాబాద్ లోనే. హైద్రాబాద్ లోని మాదాపూర్‌ పాఠశాలలో 9 తరగతి చదువుతున్న బాలిక(15) శనివారం మధ్యాహ్నం  మూత్రశాలకు వెళ్లింది. అక్కడే ఓ పాపకు జన్మనిచ్చింది. దీనిని గమనించిన మరో విద్యార్థిని ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపింది. బాలికను పాపను వేరే గదిలోకి తీసుకెళ్ళి శుభ్రం చేశారు టీచర్లు…అయితే 9 వ తరగతి అమ్మాయి 9 నెలలుగా పాఠశాలకు వస్తున్నప్పటికీ  టీచర్లు ఆ విషయాన్ని గుర్తించకపోవడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Comments

comments

Share this post

scroll to top