ఆరాధ్య ఎప్పుడు చూసినా తల్లి వెంటే ఉంటుంది, స్కూల్‌కు వెళ్లదా..? అన్న మహిళకు “అభిషేక్” హైలైట్ కౌంటర్!

అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌.. బాలీవుడ్ లో ప్రముఖ జంట.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఐశ్వర్యారాయ్‌ అయితే తన ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్‌ను ఎప్పుడూ తన వెంట తీసుకెళ్తుంటుంది. ఈ మధ్య కాలంలో అయితే చాలా ఫంక్షన్లలో మనం ఐశ్వర్య, ఆరాధ్యలను చూశాం. ఎప్పుడు చూసినా ఆరాధ్య అమ్మకూచిలా అమ్మ వెంటే ఉంటుంది. అయితే ఇదే విషయాన్ని గమనించిన ఓ మహిళ తన ట్విట్టర్‌ ఖాతాలో ఆరాధ్య, ఐశ్వర్య గురించి కామెంట్‌ పెట్టింది. ఇంతకీ ఆమె ఏమని కామెంట్‌ పోస్ట్‌ చేసిందంటే…

ఆధార్య ఎప్పుడు చూసినా తన తల్లి వెంటే ఉంటుంది. ఆమె స్కూల్‌కు వెళ్లదా ? అందరు పిల్లల్లా ఆమె సాధారణ బాల్యాన్ని గడపలేకపోతుంది. ఎందుకు ? నిజంగా ఐశ్వర్యరాయ్‌కు అందం ఉంది కానీ, పిల్లలను పెంచే బ్రెయిన్‌ లేదు. ఆమెను బ్యూటీ వితౌట్‌ బ్రెయిన్‌ అని అనవచ్చు.. అని ఆ మహిళ కామెంట్‌ పోస్ట్‌ చేసింది. దీంతో ఆమె పోస్టుకు ఐశ్వర్యారాయ్‌ స్పందించలేదు. కానీ ఆమె భర్త అభిషేక్‌ బచ్చన్‌ స్పందించాడు. అందుకు అభిషేక్‌ ఏమని రిప్లై ఇచ్చాడంటే…

మేడమ్‌.. మీరు తప్పుగా ట్వీట్‌ చేశారు.. ఆరాధ్య వారం మొత్తం స్కూల్‌కు వెళ్తుంది. వీకెండ్స్‌లో వెళ్లదు. ఆ విషయం మీకు తెలియదనుకుంటా. వారం చివర్లో స్కూల్స్‌కు హాలిడే ఉంటుంది… అని అభిషేక్‌ ట్వీట్‌చేశాడు. అయితే అందుకు ఆ మహిళ మళ్లీ రిప్లై ఇచ్చింది. తాను ఇండియన్‌ కాదని, ఫారిన్‌లో ఉంటానని, వారాంతాల్లో స్కూల్స్‌ ఉండవనే విషయం తనకు తెలియదని, ఫారిన్‌ అయితే వారాంతాల్లో కూడా స్కూల్స్‌ ఉంటాయని ఆమె ట్వీట్‌ చేసింది. అందుకు అభిషేక్‌.. సరే.. అంటూ మరో ట్వీట్‌ చేసి.. వివాదాన్ని అంతటితో ముగించాడు. అయితే ఈ ట్వీట్ల జోరు ఏమోగానీ గత కొద్ది రోజుల నుంచి ఈ విషయం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అది సరే.. ఇంతకీ ఆరాధ్య అమ్మకూచినా.. లేదంటే అందరు పిల్లల్లా సాధారణ బాల్యమే గడుపుతుందా..? నిజంగా ఇది తేల్చాల్సిన విషయమే కదా..!

Comments

comments

Share this post

scroll to top