స్కూల్ ఫీజ్ కోసం టీచర్లందరు కలిసి తండ్రిని తిట్టారని….ఆత్మహత్య చేసుకున్న 13 యేళ్ళ బాలిక.

ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ కు చెందిన రతన్ సింగ్ తోమర్ కు నలుగురు పిల్లలు . వారికి మంచి చదువులు అందించాలని…వారిని దగ్గర్లోని మంచి ప్రైవేట్ స్కూల్ లో చేర్పించాడు. ప్రతి యేడాదిలా కాకుండా…. ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో ఫీజులను పెంచేశారు స్కూల్ యాజమాన్యం. దీంతో పిల్లల్ని అక్కడ చదివించడం అర్థికంగా తట్టుకోలేని రతన్ సింగ్ తన పిల్లల్ని  ఆ స్కూల్ మాన్పించి దగ్గర్లోని మరో స్కూల్లో  చేర్పించాడు . కొన్ని రోజుల తర్వాత పాత స్కూల్ కు చెందిన 11 మంది టీచర్లు రతన్ సింగ్ ఇంటికి వచ్చారు. గతేడాది ఫీజుల రూపంలో తమకు బాకీ ఉన్న  11 వేల రూపాయలను తక్షణమే చెల్లించాలని ఇంటి ముందు గొడవకు దిగారు.

డబ్బులు తేవడానికి తన భార్య పుట్టింటికి వెళ్లిందని….రాగానే చెల్లిస్తానని చెప్పినా..వినని టీచర్లు అతడిని నానా మాటలు అంటూ చేయి చేసుకున్నారు. అంతే కాకుండా తమ మీద దాడి చేశాడని పోలీస్ కంప్లైట్ కూడా ఇచ్చారు. పోలీసులు వచ్చి రతన్ సింగ్ ను అరెస్ట్ చేశారు.

 

వాళ్లంతకు వాళ్లే వచ్చి..బకాయి  ఫీజ్ చెల్లించాలని..రతన్ సింగ్ ను కొట్టి …పైగా రివర్స్ కేస్ పెట్టిన టీచర్స్ చర్యకు తట్టుకోలేని రతన్ సింగ్  13  యేళ్ళ కూతురు ప్రియాన్షి సింగ్ ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయింది.   పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆ స్కూల్ లో చేర్పించిన పాపానికి రతన్ సింగ్ తన కూతురిని కోల్పోయాడు. ఇప్పుడు చాలా ప్రైవేట్ స్కూల్స్ ఇలాగే నడుస్తున్నాయి. పద్మవ్యూహాలను తలపిస్తున్నాయి. ఒక్కసారి ఎంట్రీ అయితే చాలు….10 వ తరగతి పూర్తయ్యే వరకు తమ నుండి పిల్లలు వేరే స్కూల్స్ కు వెళ్లకుండా అనేక పన్నాగాలు పన్నుతున్నాయి. అధిక ఫీజులతో మద్యతరగతి ప్రజల రక్తాన్ని పీల్చుతున్నాయి. అయిన 11 వేల కోసం…ఇంటికెళ్లి మరీ  గొడవకు దిగే యాజమాన్యం తమ స్కూల్స్ లో పిల్లలకు ఎటువంటి నైతిక విలువలు బోధిస్తారు!?

 

Comments

comments

Share this post

scroll to top