భారీ స్కామ్ లో KTR ,వెంకయ్యనాయుడు కొడుకు కంపెనీలకు భాగస్వామ్యం ఉందా! జాతీయ ఛానల్ సంచలన ప్రసారం

తెలంగాణ పోలీసు వాహనాల కొనుగోళ్ళల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని న్యూస్ ఎక్స్ ఛానల్ ఓ కథనాన్ని టెలికాస్ట్ చేసింది. ఇది  ఇప్పుడు రాజకీయ వర్గాల్లో  హట్ టాపిక్ గా మారింది. తెలంగాణ  రాష్ట్ర మంత్రి KTR  , కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమారుల కంపెనీలకు ఈ భారీ స్కామ్ లో భాగం ఉన్నట్లు ఆ ఛానల్ తెలిపింది.

వివరాల్లోకెలితే  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖను న్యూయార్క్ తరహా పోలీసు విధానంలా మారుస్తామని తెలంగాణ  పేర్కొన్న ముఖ్యమంత్రి కెసిఆర్, ,ఆ దిశగా అడుగులు వేసి….

police bike

 

తెలంగాణ పోలీసులకు  3,883 ఇన్నోవా వాహానాలను,  రెండువేల హీరో బైక్ లను అందించారు. అయితే రూ.207 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టు వెనుక భారీ స్కామ్ ఉందని న్యూస్ ఎక్స్ ఛానల్ ప్రసారం చేసింది.  అంతేకాకుండా ఈ స్కామ్ వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు కేటీఆర్  , కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమారుడుకి చెందిన కంపెనీలు ఉన్నట్లు ఆ చానెల్ ప్రసారం చేసింది. ఎటువంటి టెండర్లు లేకుండా వెంకయ్య కుమారునికి చెందిన హర్ష టయోటా కంపెనీ నుంచి టయోటా వాహనాలు, కేటీఆర్ కుమారుడికి చెందిన హిమాన్షు మోటార్స్ నుంచి బైక్ లు సప్లై చేసినట్లు సదరు ఛానల్ తెలిపింది.

telangana police car

దీనిపై పూర్తి వివరాలకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయ్, ఆధారలతో ఓ నేషనల్ మీడియా బయటపెట్టిన కథనంతో కౌంటర్ ఎటాక్ కు రెడీ అయిపోతున్నాయ్ అపోజిట్ పార్టీలు, దీనిపై ఇప్పటి వరకు KTR  కానీ, వెంకయ్య నాయుడు కానీ స్పంధించలేదు. కానీ ఇదే విషయం పై తెలంగాణ పోలీసులు సదరు ఛానల్ పై పరువు నష్టం దావా వేసినట్టు సమాచారం.

CLICK: పట్టాల మీద నడవాల్సిన ట్రైన్ ఫ్లాట్ ఫాం మీద పరుగులు తీసింది!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top