వచ్చేనెల నుండి అమల్లోకొచ్చే SBI కొత్త నిభందనలు ఇవే…తస్మాత్ జాగ్రత్త…

మీరు SBIఅకౌంట్ హోల్డరా.. అయితే లావాదేవీలు జరిపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ..భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బీఐ) ఏప్రిల్‌ 1 నుంచి కనీస నిల్వ లేని ఖాతాదారులకు పెనాల్టీ విధించనున్నది. బ్యాంక్‌కు వచ్చి లావాదేవీలు నిర్వహించడాన్ని తగ్గించే క్రమంలో ఒక నెలలో మూడుసార్లు మాత్రమే ఉచితంగా నగదు డిపాజిట్లకు అనుమతినిచ్చి..తదుపరి డిపాజిట్లకు చార్జీలు వేయనుంది. వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చే ఈ కొత్త చార్జీల నిబంధనలు తెలుసుకోండి

– ఎస్‌బీఐ ఏటీఎంలలో విత్ డ్రా5సార్లు దాటితే రూ.10 చొప్పున ఫైన్ …
– ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి క్యాష్‌ విత్‌డ్రాలకు 3 సార్లకు పరిమితం. ఇది దాటితే రూ.20 చార్జీ
– నెలకు మూడు నగదు డిపాజిట్లు ఉచితం. నాలుగో డిపాజిట్‌ నుంచి సర్వీస్ ట్యాక్స్ తో పాటు రూ.50 చార్జీ
– మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఉన్న బ్యాంకు శాఖలలో కనీస నగదు నిల్వ రూ.5,000. దీనిలో 75శాతం కన్నా తక్కువ ఉంటే రూ.100 జరిమానాతో పాటు సేవా పన్ను
– కనీస నగదులో కంటే ఖాతాలో 50శాతం తక్కువ మొత్తం ఉంటే సర్వీస్‌ చార్జీతో కలిపి రూ.50 జరిమానా
– ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లపై నెలకు రూ.15 చార్జ్‌
– కరెంటు ఖాతాలో కనీసం రూ.20,000 నిల్వ ఉండాల్సిందే
– బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.25వేల కన్నా ఎక్కువ మొత్తం ఉంటే, ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి ఎన్ని సార్లయినా నగదు ఉపసంహరణకు అనుమతి. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసినా చార్జ్‌ పడకూడదని భావిస్తే లక్ష రూపాయలు కనీస నిల్వ ఉంచాల్సిందే.
– రూ.1000 వరకు యూపీఐ, యూఎస్‌ఎస్‌డీ లావాదేవీలపై చార్జ్‌ల మినహాయింపు

ఎస్ బీ ఐతో పాటు ప్రైవేటు బ్యాంకులు HDFC,AXIS,ICICI కూడా ఇదే తరహలో నిభందనలు విధించనున్నాయి.

Comments

comments

Share this post

scroll to top