GOOD NEWS: స్టేట్ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..”మినిమం బాలన్స్” పై సరికొత్త నియమాలు ఇవే.!

స్టేట్ బ్యాంకు ఖాతాదారులు తప్పనిసరిగా మినిమం బాలన్స్ మెయింటేయిన్ చేయాలని లేదంటే చార్జీలు పడతాయని గత కొన్ని నెలలుగా నిభందన అమలవుతోంది . హైదరాబాద్ వంటి నగరాల్లో 5000 , పల్లెల్లో అయితే 1000 రూపాయల మినిమం బాలన్స్ మైంటైన్ చేయాలని హెచ్చరించారు కూడా. అయితే ఈ సవరణపై ఖాతాదారులు మండి పడ్డారు.అది వేరే విషయం…మినిమం బ్యాలెన్స్ లేదనే నెపంతో విధించిన ఫైన్ కూడా కొన్ని వేల కోట్లు అని ఇంతకుముందొకసారి వార్తలొచ్చాయి..ఇప్పుడు తాజాగా మినిమం బ్యాలెన్స్ తగ్గించినట్టు ప్రకటించింది స్టేట్ బ్యాంకు..

నెలవారీ కనీస మొత్తాల నిబంధనల నుంచి స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కస్టమర్లకు కొంత ఉపశమనం కల్పించింది.  కనీసం బ్యాంకు ఖాతాల్లో తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తాన్ని రూ.5000 నుంచి రూ.3000కు తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. అంతేకాక పెన్షనర్లు, ప్రభుత్వం నుంచి సామాజిక ప్రయోజనాలు పొందే లబ్దిదారులు, మైనర్‌ అకౌంట్లు ఈ నిబంధన నుంచి మినహాయిస్తున్నట్టు చెప్పింది. పీఎంజేడీఐ అకౌంట్లు, బేసిక్ సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్‌ అకౌంట్లు కేటగిరీలను ఇప్పటికే ఎస్‌బీఐ ఈ నిబంధన నుంచి మినహాయించిన సంగతి తెలిసిందే. మినిమమ్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌ను నిబంధనను పాటించిన వారికి వేస్తున్న ఛార్జీలను కూడా 20 శాతం నుంచి 50 శాతానికి తగ్గించింది. అందరికీ ఈ తగ్గించిన ఛార్జీలే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది…

Comments

comments

Share this post

scroll to top