మినిమం బాలన్స్ మెయింటైన్ చేయని వారినుండి “SBI” ఎన్ని కోట్ల ఫైన్ వసూలు చేసిందో తెలుసా..?

పేద వాడి డ‌బ్బులంటే అంద‌రికీ ఆశే. ప్ర‌భుత్వాలు, రాజ‌కీయ నాయ‌కులు మొద‌లుకొని బ్యాంకుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రికి పేద వాడి పైసా పైనే క‌న్ను ఉంటుంది. అదేం విచిత్ర‌మో. వేల కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టి తిరిగే వారిని వారు ఏమీ చేయ‌రు. ట్యాక్సులు, చార్జీల పేరుతో మాత్రం పేద‌ల‌ను బాదుతారు. ముక్కు పిండి డ‌బ్బులు వ‌సూలు చేస్తారు. అందులోనూ ఎస్‌బీఐ ఆ ప‌నిచేయ‌డంలో ముందుంటుంది. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఇంత‌కీ ఈ బ్యాంకు ఏం ప‌నిచేసంద‌నే క‌దా మీ డౌట్‌. ఏమీ లేదండీ.. అదేమిటంటే..

గతంలో ఎస్‌బీఐ త‌న బ్యాంకు ఖాతాల్లో క‌నీస న‌గ‌దు (మినిమ‌మ్ బ్యాలెన్స్‌) మెయింటెయిన్ చేయ‌క‌పోతే అలాంటి వినియోగ‌దారుల నుంచి చార్జీలు వ‌సూలు చేస్తామని చెప్పింది కదా. అవును, ఇప్పుడు ఆ పని చేసింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి త్రైమాసికం పూర్తి కావ‌డంతో 3 నెల‌ల పాటు బ్యాంకు ఖాతాల్లో మినిమ‌మ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయ‌ని ఖాతాల నుంచి కోట్ల రూపాయ‌ల‌ చార్జిని ఫైన్ రూపంలో వ‌సూలు చేసింది. మొత్తం దేశ వ్యాప్తంగా 3.88 కోట్ల ఖాతాల నుంచి ఫైన్ రూపంలో రూ.235 కోట్ల‌ను ఎస్‌బీఐ వ‌సూలు చేసింది. అవును మీరు విన్న‌ది కరెక్టే.

షాకింగ్‌గా ఉన్నా ఇది నిజ‌మే. ఇదే విష‌యంపై సమాచార హక్కు కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ ఆర్‌టీఐ ద్వారా స‌మాచారం సేక‌రించారు. బ్యాంక్ ఆపరేషన్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ర్యాంక్ ఆఫీసర్ నుంచి ఆర్‌టీఐ ద్వారా ఆయ‌న ఈ స‌మాచారం సేక‌రించారు. అందులోనే ఈ విషయం తెలిసింది. అయితే ఏయే త‌ర‌హా ఖాతాల నుంచి ఎంత మొత్తం ఫైన్ వ‌సూలు చేశారు అన్న దానిపై వివ‌రాలు లేవు. దానిపై కూడా త్వ‌ర‌లోనే వివ‌రాల‌ను సేక‌రిస్తాన‌ని అంటున్నారు చంద్ర‌శేఖ‌ర్‌. ఎస్‌బీఐ మినిమం బ్యాలెన్స్ చార్జి పేరిట వ‌సూలు చేసింది పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల డ‌బ్బేన‌ని, వారి వ‌ద్ద డ‌బ్బు లేక‌పోతే అకౌంట్ల‌లో ఎలా వేస్తార‌ని, వాటిని ఎలా మెయింటెయిన్ చేస్తార‌ని ఆయన ప్ర‌శ్నిస్తున్నారు. ఎప్పుడో ఒక సారి అకౌంట్‌లో వేసి జాగ్ర‌త్తగా ఖ‌ర్చు పెట్టుకునే ప్ర‌జ‌ల ఖాతాల నుంచి డ‌బ్బును ఫైన్ రూపంలో వ‌సూలు చేయ‌డం దారుణ‌మ‌ని, దీనిపై అవ‌స‌రం అయితే కోర్టులో స‌వాల్ చేస్తాన‌ని ఆయ‌న అంటున్నారు. ఏది ఏమైనా ఈ విష‌యంలో మాత్రం నేత‌లు ఒక‌సారి ఆలోచించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top