నిరుద్యోగులకు శుభవార్త: రాత ప‌రీక్ష లేకుండా కేవ‌లం ఇంట‌ర్వ్యూ ద్వారానే ఎస్‌బీఐలో ఉద్యోగాలు..! వివరాలు ఇవే.!

భారతీయ స్టేట్ బ్యాంకు (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మన దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా పేరు గాంచింది. ఈ బ్యాంక్‌కు ఉన్న బ్రాంచిల సంఖ్య, వాటిల్లో పనిచేసే సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా గుర్తింపు పొందింది. 1806లో కోల్‌కతాలో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటిగా పేరెన్నిక గ‌న్న‌ది. కాగా ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) – స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్స్‌ నియామకానికి తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 119 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వాటి వివ‌రాలు ఇవే…

1. స్పెషల్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌
ఖాళీలు: 35 (జనరల్‌ వర్గానికి 19, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ఓబీసీలకు 9 ఖాళీలను కేటాయించారు)
పోస్టింగ్‌: ముంబై, ఢిల్లీ
వయస్సు: 2017 డిసెంబరు 31 నాటికి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: సీఏ / ఐసీడబ్ల్యుఏఐ / ఏసీఎస్‌ / (ఎంబీఏ / పీజీ డిప్లొమా) (ఫైనాన్స్‌) పూర్తిచేసి ఉండాలి. కరస్పాండెన్స్‌ లేదా పార్ట్‌ టైం కోర్సులు చేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల్లోగానీ, అసోసియేట్‌/ సబ్సిడియరీ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల్లోగానీ, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల్లోగానీ ఎగ్జిక్యూటివ్‌గా అయిదేళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సంస్థ నిర్ణయం ప్రకారం ఇంటర్వ్యూలో కనీసార్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

2. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌
ఖాళీలు: 2
విభాగం: లా
పోస్టింగు: ముంబై
వయస్సు: 42 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడేళ్లు/ అయిదేళ్ల లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. పీజీ(లా) అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా గుర్తింపు పొంది ఉండాలి. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు/ ప్రముఖ ఆర్థిక సంస్థల్లో లా ఆఫీసర్ గా కనీసం 17 ఏళ్ల అనుభవం ఉండాలి. బార్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన తరవాతి అనుభవాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

3. డిప్యూటీ మేనేజర్‌
ఖాళీలు: 82
విభాగం: లా
వయస్సు: 2017 డిసెంబరు 31 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. బార్‌ కౌన్సిల్‌లో గుర్తింపు పొందిన తరవాత న్యాయవాదిగా లేదా ఏదైనా షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులో లా ఆఫీసర్‌గా నాలుగేళ్లు పనిచేసి ఉండాలి. లేదా న్యాయవాది, లా ఆఫీసర్‌ రెండింటిలో కలిపి నాలుగేళ్ల అనుభవం ఉన్నా పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష వివరాలు: ఆన్‌లైన్‌ టెస్ట్‌లో మూడు విభాగాలనుంచి ప్రశ్నలు ఇస్తారు. రీజనింగ్‌ నుంచి 70 ప్రశ్నలు (70 మార్కులు), ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 50 ప్రశ్నలు (50 మార్కులు), ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నుంచి 50 ప్రశ్నలు (100 మార్కులు) ఇస్తారు. రీజనింగ్‌, ఇంగ్లీష్‌ విభాగాలకు కలిపి 90 నిమిషాల పరీక్ష సమయం ఉంటుంది. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌కు విడిగా 45 నిముషాల సమయం ఇస్తారు. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ పేపర్‌ మినహా మిగిలిన రెండు పేపర్లలో బ్యాంకు నిర్ణయం మేరకు కనీసార్హత మార్కులు రావాలి. ప్రశ్నపత్రాన్ని హిందీ, ఇంగ్లీషు మాధ్యమాల్లో ఇస్తారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌లో అర్హత పొందినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి 50 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూలో అర్హత పొందాలంటే ఎన్ని మార్కులు రావాలో బ్యాంకు నిర్ణయిస్తుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను 25 మార్కులకు లెక్కకడతారు. వీటికి ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ పేపర్‌లో వచ్చిన మార్కులను కలిపి మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు.

ఇతర వివరాలు…
ఈ ఉద్యోగాల‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 7
రాత పరీక్ష: మే 6వ తేదీ
మ‌రిన్ని వివ‌రాల‌కు వెబ్‌సైట్‌ www.sbi.co.in/careers ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top