“Deposit చేసినా ఛార్జ్, Withdraw చేసినా ఛార్జ్”..SBI తీరును వ్యతిరేకిస్తున్నారా??..అయితే ఇలా చేయండి!

నవంబర్ 8 న మోడీ పెద్ద షాక్ ఇచ్చారు…నోట్ల బాన్ నుండి ఇంకా తెలుకోలేదు ఇంతలో hdfc , icici , axis బ్యాంకులు withdraw లిమిట్ పై చార్జీల మోతతో మరో షాక్ ఇచ్చారు!…నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా డ్రా చేయొచ్చు..ఆ తరవాత చేసే ట్రాన్సాక్షన్ పై కనీసం 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది…ఇది ప్రైవేట్ బ్యాంకుల పరిస్థితి..స్టేట్ బ్యాంకు కూడా చార్జీలు విధించింది…కాకపోతే ప్రైవేట్ బ్యాంకుల లాగా కాదు…అయిదవ ట్రాన్సాక్షన్ కి పది రూపాయలు చెల్లించాలి!…ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ ప్రకటించింది స్టేట్ బ్యాంకు…

శాలరీ అకౌంట్ల పై అయితే భారీ బాదుడు…డిపాజిట్ చేసిన చార్జీలు, withdraw చేసిన చార్జీలు…నెలలో మూడు సార్లు మాత్రమే ఉచితంగా డిపాజిట్ చేయగలరు. తరవాత చార్జీలు వర్తిస్తాయి…మెట్రోపాలిటన్ నగరాల్లోని శాఖల్లో పొదుపు ఖాతాలు ఉన్న వినియోగదారులు తమ ఖాతాల్లో 5,000 రూపాయల కనీస మొత్తాలను ఉంచాల్సి ఉంటుంది. ఈ నగదు నిల్వలను ఉంచని ఖాతాదారులపై సర్వీస్ టాక్స్ తో పాటు 100 రూపాయలు పెనాల్టీని విధించనుంది SBI. 50 శాతం కంటే తక్కువ నిల్వలున్న ఖాతాలపై సర్వీస్ టాక్స్ తో పాటు 50 రూపాయలు, 50-75 శాతం తక్కువ నిల్వలున్న ఖాతాలపై 75 రూపాయల పెనాల్టీని బ్యాంకు విధించనుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాల్లో నగదు నిల్వ 1,000 రూపాయల లోపునకు తగ్గితే లెవీ చార్జీలను విధించనున్నట్లు వెల్లడించింది SBI.

ఏప్రిల్ 1 నుండి అమలు లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే:

“సేవింగ్స్ అకౌంట్” మినిమం బాలన్స్ (MB):

  • హైదరాబాద్ (మెట్రోపాలిటన్ సిటీ) – 5000 రూపాయలు
  • గ్రామాలు – 1000 రూపాయలు

మినిమం బాలన్స్ లేకుంటే —> 50 రూపాయల జరిమానా + సర్వీస్ టాక్స్

సర్వీస్ టాక్స్:

  • 50 శాతం కంటే తక్కువ నిల్వ ఉంటే – 50 రూపాయలు
  • 50 – 75 శాతం తక్కువ నిల్వ ఉంటే – 75 రూపాయలు

Deposit పై చార్జీలు:

  • మూడు సార్లు మాత్రమే ఉచితంగా డిపాజిట్ చేయగలరు.
  • నాలుగవ సారి మీ అకౌంట్ లో డిపాజిట్ చేస్తే 50 రూపాయల కనీస ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది.

4వ డిపాజిట్ నుండి డిపాజిట్ చేసిన ప్రతి సారి —> 50 రూపాయల జరిమానా + సర్వీస్ టాక్స్

withdraw పై చార్జీలు:

  • స్టేట్ బ్యాంకు లో అయిదు సార్లకంటే ఎక్కువ withdraw చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్ కి పది రూపాయలు ఛార్జ్
  • వేరే బ్యాంకు ఎటిఎం నుండి మూడు సార్లకంటే ఎక్కువ withdraw చేస్తే ఇరవై రూపాయల ఛార్జ్

స్టేట్ బ్యాంకు —> 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ —> 6 వ withdrawl నుండి 10 రూపాయల ఛార్జ్
వేరే బ్యాంకు —-> 3 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ —-> 4 వ withdrawl నుండి 20 రూపాయల ఛార్జ్

ఏప్రిల్ 6 న “నో ట్రాన్సాక్షన్” డే:

‘‘బ్యాంకులు లావాదేవీల పరిమితిని తగ్గిస్తున్నాయి. లావాదేవీల ఫీజులను పెంచుతున్నాయి. మనం అన్నిటికీ పన్ను కట్టాల్సి వస్తోంది. సంపాదించినా పన్ను.. ఖర్చుపెట్టినా పన్ను.. డిపాజిట్‌ చేసినా పన్ను.. మన డబ్బు మనం విత డ్రా చేసినా పన్ను! రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వడం తప్ప ఇంక ఏ పనిచేసినా పన్ను వేస్తున్నారు. ప్రజలపై ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ఖాతాదారులందరు కలిసి సోషల్ మీడియా వేదికగా ఏప్రిల్ 6 న “నో ట్రాన్సాక్షన్” డే గా ప్రకటించారు. ఆ రోజున ఎవ్వరు బ్యాంకు నుండి లావాదేవీలు చేయొద్దు అని నిర్ణయించుకున్నారు!

 

Comments

comments

Share this post

scroll to top