GST ఎఫెక్ట్: బ్యాంకు సేవలపై “SBI” భారీ చార్జీలు..! వివరాలు ఇవే..!

జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్‌టీ బిల్లు అమ‌లులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ప‌లు శ్లాబుల్లో ఆయా వ‌స్తువులు, సేవ‌ల‌పై జీఎస్‌టీని వ‌సూలు చేస్తున్నారు. కాగా పెరిగిన ధ‌ర‌ల‌ను దృష్టిలో ఉంచుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా త‌న ఐఎంపీఎస్ (ఇమ్మిడియ‌ట్‌ పేమెంట్ స‌ర్వీస్‌) చార్జిలలో మార్పులు చేసింది. దీని ప్ర‌కారం ఇక‌పై ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులు ఐఎంపీఎస్ ద్వారా డ‌బ్బులు పంపుకుంటే ప‌డే చార్జిల వివ‌రాలు మార‌నున్నాయి. అవేమిటంటే…

ఎస్‌బీఐ ఖాతాదారులు ఐఎంపీఎస్ విధానంలో న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే కొత్త చార్జీలు ప‌డ‌నున్నాయి. ఐఎంపీఎస్ కింద రూ.1వేయి వ‌ర‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే న‌గ‌దుకు ఎలాంటి చార్జిలు లేవు. అదే రూ.1వేయి నుంచి రూ.1 ల‌క్ష న‌డుమ న‌గదు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే రూ.5 చార్జిలు ప‌డ‌తాయి. రూ.1 ల‌క్ష నుంచి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఐఎంపీఎస్ ద్వారా పంపుకుంటే అప్పుడు రూ.15 చార్జి ప‌డుతుంది. ఇక ఈ చార్జిల‌కు జీఎస్‌టీ అద‌నంగా ప‌డుతుంది. అంటే.. స‌ద‌రు రుసుముపై 18 శాతం ట్యాక్స్‌ను అద‌నంగా చెల్లించాలి.

మారిన ఐఎంపీఎస్ చార్జిలు త‌క్ష‌ణ‌మే అమ‌లు కానున్నాయ‌ని ఎస్‌బీఐ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. జూలై 1న దేశ వ్యాప్తంగా అమ‌లులోకి వచ్చిన జీఎస్‌టీ బిల్లును దృష్టిలో ఉంచుకుని అందులో ఇచ్చిన విధంగా ఐఎంపీఎస్ చార్జిల‌ను మార్చామ‌ని వారు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇక‌పై వినియోగ‌దారుల‌కు పైన చెప్పిన చార్జితోపాటు జీఎస్‌టీలో ఉన్న విధంగా 18 శాతం ట్యాక్స్ ప‌డుతుంద‌ని పేర్కొంటున్నారు.

Comments

comments

Share this post

scroll to top