రేప్ చేస్తున్నారనుకొని పోలీసులకు పట్టించారు..! యువతి తండ్రి వచ్చి ఏం చెప్పాడో తెలుసా..?

గుడియాత్తం పట్టణంలోని క్రాస్‌ రోడ్డు  వద్ద జాతీయ రహదారిపై చిత్తూరు వైపు నుంచి బెంగుళూరు వైపు వెళుతున్న “ఇన్నోవా” కారు ఆగింది. అందులో నుంచి ఆరుగురు యువకులు, ఓ యువతి దిగి టీ దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ యువకులు టీ తాగిన తిరిగి కారు వద్దకు వెళ్లారు. అప్పటి వరకు వారి వెంట మౌనంగా ఉన్న ఆ యువతి ఉన్నట్టుండి పారిపోవడానికి ప్రయత్నించడంతో ఆ యువకులు ఆ అమ్మాయిని పట్టుకొని బలవంతంగా కారులో ఎక్కించారు. ఈ ఘటన చూసిన స్థానికులు అనుమానించి వెంటనే కారును చుట్టుముట్టి పోలీసులకు అప్పగించారు. పోలీస్‌ స్టేషన్ లో ఆ యువకులు ఏం చెప్పారో తెలుసా?

చండీఘర్‌లో ఓ యువతి మంగళవారం డెహ్రడూన్ నుంచి మధురై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఒంటరిగా ఎక్కింది. ఆమె పేరు “ప్రియాంక కండేల్‌”. చండీఘర్‌కు చెందిన ప్రీతిచంద్‌ కుమార్తె. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌ లో మహ్మద్‌ జుబేల్‌, మహ్మద్‌షావనార్‌, ఘయా జుద్దీన్ మరో ముగ్గురు వస్త్ర వ్యాపారులు అదే రైలులో ఎక్కారు. వీరు కర్ణాటక రాష్ట్రం ముళబాగల్‌లో వస్త్ర వ్యాపారం చేసేవారు (ముళబాగల్‌ పలమనేరుకు 40 కిలో మీటర్ల దూరంలో ఉంది). ప్రియాంక ప్రయాణిస్తున్న బోగీలోనే ఎక్కిన వారు పలకరించి ఆమె స్వస్థలం చండీఘర్‌ అని, ఆమె వద్ద ఉన్న ఆధార్‌ కార్డు ద్వారా ఆమె తండ్రి ప్రీతిచంద్‌ అని తెలుసుకున్నారు. మరికొద్దిసేపటి తరువాత ప్రీతిచంద్‌ ఫోన్ నెంబర్‌ కూడా తీసుకొని వారు ఏం మాట్లాడారు.

అయితే “ప్రియాంక ఇంటి నుంచి చెప్పకుండా వచ్చేసిందని.. ఆమె మానసిక స్థితి సరిగాలేదని ఆమె తండ్రి చెప్పారు.” తాము ముళ బాగల్‌కు వ్యాపారం నిమిత్తం వెళుతున్నామని వస్త్ర వ్యాపారాలు చెప్పడంతో ప్రీతిచంద్‌ తను బెంగుళూరు విమానాశ్రయానికి వస్తానని తన బిడ్డను విమానాశ్రయం వద్ద అప్పగించాలని ఆ యువకులను కోరాడు.

అలా చెప్పడంతో..యువకులు నాయుడుపేట రైల్వే స్టేషన్ లో బుధవారం తెల్లవారుజామున దిగారు. ప్రియాంకకు నచ్చజెప్పి తమ వెంట బెట్టుకుని అక్కడే ఇన్నోవా కారును అద్దెకు మాట్లాడుకుని బెంగుళూరుకు బయలుదేరారు. మార్గమధ్యలో  పలమనేరులో టీ తాగేందుకు వాహనం నిలిపారు. టీ తాగి తిరిగి వాహనం ఎక్కే సమయంలో ఆ అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నించడంతో పట్టుకున్నారు. ఇది చూసిన స్థానికులు ఆ అమ్మాయిని పాడుచేసేందుకు తీసుకెళ్లుతున్నారేమో అనే అనుమానంతో కారును చుట్టుముట్టి  వారిని పోలీసులకు అప్పగించారు.

పోలీసులు “ప్రియాంక” తండ్రితో ఫోన్ లో మాట్లాడి జరిగింది తెలుసుకున్నారు. ప్రీతిచంద్‌ను, కుటుంబ సభ్యులను పలమనేరుకు రావాలని పోలీసులు సూచించడంతో బుధవారం మధ్యాహ్నం ప్రీతిచంద్‌, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. పలమ నేరు ఏఎస్‌ఐ జేపీరావు ప్రియాంకను తండ్రి ప్రీతిచంద్‌కు అప్పగించారు. మానవత్వంతో, ఎంతో బాధ్యతగా యువతిని జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పగించిన వస్త్ర వ్యాపారులను పోలీసులు, ప్రీతిచంద్‌ కుటుంబసభ్యులు అభినందించారు.

Comments

comments

Share this post

scroll to top