కులపిచ్చి పీక్ లెవల్లో ఉన్నవాళ్లకు చెంపపెట్టు ఈ వీడియో.! ఈ కాలేజ్ కుర్రాళ్లను అభినందించకుండా ఉండలేం.

సీన్ చావు వరకు వస్తే….వైద్యం చేసే డాక్టర్ ఏ కులమైనా మనకవసరం లేదు, బతికితే చాలు! అదే బతికున్నప్పుడు మాత్రం మనకు కులం కావాలి? ఇదే కాన్సెప్ట్ ను ఇంకాస్త వివరంగా కులపిచ్చి పీక్ లెవల్లో ఉన్నవాళ్లను  సరిగ్గా చాచిపెట్టి కొట్టే విధంగా ఓ స్కిట్ లో చూపించారు గుంటూరు కు చెందిన ఇంజనీరింగ్ కాలేజ్ కుర్రాళ్లు.. సమాజంలో అతిపెద్ద జాడ్యాల్లో ఒకటైన కులం పట్ల వారు ప్రదర్శించిన ఈ స్కిట్ ను చూస్తే నిజంగానే యువత  ఆలోచన తీరుకు ముచ్చటేస్తుంది. సమసమాజ స్థాపనలో కుర్రాళ్ల పాత్ర ఏవిధంగా ఉండాలో కళ్లకు కట్టినట్టు చూపిన ఈ బృందాన్ని ప్రతి ఒక్కరూ మనస్పూర్తిగా అభినందించాల్సిందే.

కాలేజ్ ప్రవేశాల్లోనే కులాల పేరుతో సంఘాలుగా విడగొట్టపడుతున్నారు మన విద్యార్థులు…..ప్రలోభ పెట్టే మాటలతో వారిని ఆకట్టుకుంటున్నారు. ఇతర కులాల పట్ల ద్వేషబావాన్ని నింపుతున్నారు. వీటన్నింటిని నుండి యువత దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది..ఈ వీడియో చూశాక కులం అనే అహాన్ని ప్రదర్శిస్తున్న వారిపట్ల మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారని నా నమ్మకం.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top