నారా రోహిత్ " సావిత్రి" ట్రైలర్ విడుదల. ఆకట్టుకున్న ట్రైలర్.

‘ మీది కోపానికి మించిన పట్టుదల అయితే, నాది పంతానికి మించిన ప్రేమ’ అంటూ కుటుంబ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ‘సావిత్రి’ సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యువ కథానాయకుడు నారారోహిత్ . విభిన్న చిత్రాలతో అలరిస్తున్న రోహిత్, పవన్ సాధినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్ర ఆడియో వేడుక మరియు చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ నందమూరి నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా జరిగింది. బేవర్స్ గా తిరిగే హీరో, హీరోయిన్ ను ట్రైన్ లో చూసి ప్రేమలో పడతాడు. అప్పటికే హీరోయిన్ పెళ్లి సెట్ కావడంతో ఆ పెళ్లిని చెడగొట్టేందుకు ప్రేమించిన మన హీరో ఎలాంటి ఎత్తులు వేశాడు అనేది సింపుల్ గా ఈ చిత్ర కథ. ఆ విషయాన్ని ట్రైలర్ లో చూపించాడు దర్శకుడు.

సావిత్రిగా నారారోహిత్ సరసన నందిత జతకట్టింది. ధన్యబాలకృష్ణ మరో కీలకపాత్రలో నటిస్తోంది. అందమైన పెయింటింగ్ లా ఉన్న ఈ చిత్ర విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. శ్రవణ్ అందించిన సంగీతం ఒక ఎత్తయితే, కృష్ణ చైతన్య రాసిన డైలాగ్స్ సూపర్బ్ గా ఉన్నాయి. ‘సావిత్రి పెళ్లి, మా ఇంటి పరువు రెండూ ఒకటే’ అనే ఎమోషనల్ డైలాగ్, ‘నేను ధైర్యం లేకపోయినా భరిస్తాను కానీ సంస్కారం లేకపోతే సహించలేను’ అని హీరోయిన్ తండ్రి చెబుతుంటే  సార్ ‘ మీది కోపానికి మించిన పట్టుదల అయితే, నాది పంతానికి మించిన ప్రేమ’ అని తన ప్రేమ గురించి సూపర్బ్ గా చెప్పే డైలాగ్ బాగుంది. ఇక హీరో  బావా బావా అని పిలుస్తుంటే ‘చంద్రబాబుగారిని  కూడా బాలకృష్ణగారు  ఇన్ని సార్లు బావా అని పిలిచి ఉండడురా’ అనే పంచ్ బాగా పేలింది. కుటుంబ ప్రేమ కథా చిత్రంగా విజన్ ఫిలిం మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మించాడు.  సమ్మర్ కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Watch Trailer:

Comments

comments

Share this post

scroll to top